
ఇచ్చోడ, జనవరి 29 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను శనివారం ఇచ్చోడ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ముస్తాఫా, నాయకులు దాసరి భాస్కర్, ముస్కు గంగారెడ్డి, మేరాజ్ అహ్మద్, గణేశ్, గుండాల కన్నమయ్య, రవి, వెంకటేశ్, శ్రీహరి పాల్గొన్నారు.
బజార్హత్నూర్/తలమడుగు, జనవరి 29 : బజార్హత్నూర్, తలమడుగు మండల టీఆర్ఎస్ నాయకులు జిల్లా కేంద్రంలో రామన్నను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్గా ఎన్నికైన అడ్డి భోజారెడ్డిని కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ తలమడుగు మండల కన్వీనర్ తోట వెంకటేశ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోక జీవన్ రెడ్డి, తలమడుగు మండల నాయకులు అబ్దుల్లా, కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, ఆశన్న యాదవ్, ప్రకాశ్, బజార్హత్నూర్ మండల నాయకులు గణేశ్, చిల్కూరి భూమయ్య, కొత్త శంకర్, సూది నందు, గోవర్ధన్ పాల్గొన్నారు.
బేల, జనవరి 29 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, పార్టీ మండలాధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ఇంద్రశేఖర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జక్కుల మధుకర్, సర్పంచ్లు వాడ్కర్ తేజ్రావ్, విపిన్ ఖోడే, పీఏసీఎస్ చైర్మన్ బాల్చందర్, నాయకలు తన్వీర్ ఖాన్, రఘుకుల్రెడ్డి, సంతోష్ బెదుడ్కర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.