e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home ఆదిలాబాద్ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

ముథోల్‌, అక్టోబర్‌ 28 : రైతులు వరి కొనుగో లు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి సూచించారు. మం డలంలోని విట్టోలి గ్రామంలో గురువారం వరిధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నద ని పేర్కొన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు దళారు ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఏ గ్రేడ్‌ వరి ధాన్యానికి రూ. 1960, బీ గ్రేడ్‌ వరి ధాన్యానికి రూ. 1940లు చెల్లిస్తుందని పేర్కొన్నా రు. డీసీవో శ్రీనివాస్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అఫ్రోజ్‌ ఖాన్‌, సర్పంచ్‌లు రాంరెడ్డి, సత్య గౌడ్‌, నాయకులు రవీందర్‌ రెడ్డితో పాటు రైతులు ఉన్నారు. అలాగే మారుతి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందారు. ఎమ్మెల్యే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ. 31 వేలను మంజూరైన చెక్కు అందజేశారు.

సీఎం సహాయనిధి పేదలకు వరం
భైంసా, అక్టోబర్‌ 28 : సీఎం సహాయ నిధి పేదలకు వరమని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి పేర్కొన్నారు. భైంసా పట్టణానికి చెందిన పలువురి కి ముథోల్‌ క్యాంపు ఆఫీసులో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం షేక్‌ జహీల్‌కు రూ. 2 లక్షల యాభై వేలు, అబ్దుల్‌ రవుఫ్‌ రూ. ఒక లక్ష 50 వేలు, షేక్‌ ఇబ్రహీం రూ. 57 వేలు, అబ్దుల్‌ అతిక్‌ రూ. 34 వేలు, షభానా బేగంకు రూ. 11,500, ఇస్మా యిల్‌ ఖాన్‌ రూ. 60 వేల విలువైన చెక్కుల ను అందజేశారు. టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఫారూ ఖ్‌, హలా, తదితరులు ఉన్నారు.

- Advertisement -

కుభీర్‌లో..
కుభీర్‌, అక్టోబర్‌ 28 : ముథోల్‌ లోని క్యాంపు కార్యాలయంలో కుభీర్‌ మండలానికి చెందిన పలువురికి రూ.3లక్షల పైచిలుకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అందజేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు తూము రాజేశ్వర్‌, మాజీ జడ్పీటీసీ శంకర్‌ చౌహా న్‌, వైస్‌ ఎంపీపీ మోహియుద్దీన్‌, రోళ్ల రమేశ్‌, గంగాచరణ్‌, శ్రీరాముల రాజేశ్‌ చారి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ మెంచు రమేశ్‌, పల్సి ఉప సర్పంచ్‌ దత్తాత్రి, దత్తూరాం బ్రహ్మేశ్వర్‌, తోట రాజలింగు, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement