
నిర్మల్, ఆదిలాబాద్ కలెక్టర్లు ముషారఫ్ అలీ ఫారూఖీ, సిక్తా పట్నాయక్
పాఠశాలల్లో శానిటేషన్ పనుల పరిశీలన
కుంటాల, ఆగస్టు 28 : స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో పారిశుధ్య పనులు పూర్తి చేసి శుభ్రంగా ఉంచాలని నిర్మల్ క లెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కుం టాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. పాఠశాల గదు లు, పరిసరాలను పరిశీలించారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించా రు. విద్యార్థులు భౌతికదూరం పాటిస్తూ చదువుకునేలా చూడాలన్నారు. తరగతి గదులను నిత్యం శానిటైజ్ చేయాలని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడమే కాకుండా విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆహారం, తాగునీరు తదితర వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పచ్చదనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డీఈవో ప్రణీత, తహసీల్దార్ శ్రీధర్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి ఉన్నారు.
అన్ని చర్యలూ తీసుకోవాలి..
దిలావర్పూర్, ఆగస్ట్ 28 : పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులకు ఇబ్బందు లు లేకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలకేంద్రమైన దిలావర్పూర్లోని కస్తూర్బాగాంధీ కళాశాల, పాఠశాలను జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. విద్యార్థులు కూ ర్చునే బెంచీలకు శానిటైజేషన్ చేయించాలని, పరిసరాల్లో ఎక్కడా పారిశుధ్య సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈయన వెంట డీఈవో ప్రణీత, ఎంఈవో శంకర్, తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఎంపీవో అజీజ్‌ఖాన్, కళాశాల ప్రిన్సిపాల్ అపర్ణ, సర్పంచ్ వీరేశ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఉన్నారు.
జడ్పీ సీఈవో సందర్శన
సోన్, ఆగస్టు 28 : సోన్ మండలంలోని సిద్దులకుంట, జాఫ్రాపూర్ ప్రభుత్వ పాఠశాలలను జడ్పీ సీఈ వో సుధీర్‌కుమార్ పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఆయన వెంట ఇన్చార్జి ఎంపీడీవో అశోక్, ఆయా గ్రామా ల సర్పంచులు, ఉపాధ్యాయులున్నారు.
పండుగ వాతావరణంలో తెరవాలి : ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 28 : పాఠశాలల్లో పండుగ వాతావరణం కనిపించేలా ఏర్పాట్లు చే యాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పే ర్కొన్నారు. పట్టణంలోని బాలక్‌మందిర్ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. పాఠశాలలు, కళాశాల లు, అంగన్వాడీ కేంద్రాలను తెరవనున్న నేపథ్యంలో శానిటేషన్ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు ఎక్కడా సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని డీఈ వో రవీందర్ రెడ్డిని ఆదేశించారు. ప్రధానోపాధ్యాయురాలు ఊర్భాను, సిబ్బంది ఉన్నారు.