
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
అభివృద్ధి పనులకు భూమిపూజ
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 28 : సంక్షేమ పథకాల అమలును చూసి ప్రజలు మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని 22వవార్డులో రూ.30 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శనివారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కారులో సురక్షితంగా ప్రయాణించవచ్చన్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తమదేనని పేర్కొన్నా రు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు ముఖ్యమంత్రి కష్టపడుతున్నారన్నారు. పట్టణాభివృద్ధికి వివిధ మార్గాల ద్వారా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగేలా చూస్తున్నామన్నారు. 49వ వార్డులోనూ పార్టీలతో సంబంధం లేకుండా నిధులు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కూడా పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు అశోక్ స్వామి, పందిరి భూమన్న, నాయకులు సయ్యద్ మోసిన్ పాల్గొన్నారు.
పేద ఆడబిడ్డల కోసమే కల్యాణలక్ష్మి..
పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం తల్లిదండ్రులు ఎవరికాళ్లూ పట్టుకోవద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రారంభించారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ, రూరల్ గ్రామాలకు మంజూరైన 63 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేదల కోసం ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలను మనరాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. దళితబంధు పథకం తీసుకొచ్చి దళితులను ఆత్మగౌరవంతో బతికేలా చేద్దామనుకుం టే, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇతర కులాల వారికీ ఈ పథకం ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. మిగతా వర్గాలపై ప్రేముంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు అజయ్, బండారి సతీశ్, అశోక్, లక్ష్మణ్, వైస్ ఎంపీపీ రమేశ్, జగదీశ్, ఆరె నరేశ్ పాల్గొన్నారు. అనంతరం మండలంలోని భీంసరిలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వం తెన నిర్మాణం చేపడితే జందాపూర్తో పాటు ఇతర ప్రాంతాల కు రాకపోకలు సాగించవచ్చన్నారు. భీంసరిలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు త్వరలో నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఎంపీటీసీ బిక్కి గంగాధర్, నాయకులు నారాయణ, సంతోష్, ప్రమోద్, అన్నారావ్, తదితరులు పాల్గొన్నారు.