
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
ఆదిలాబాద్ రూరల్, జూన్ 28: దళితుల అభ్యున్నతికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ మున్సిప ల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆ ర్ చిత్రపటానికి చైర్మన్‌తో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సం క్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.కరోనా లాంటి విప త్కర పరిస్థితుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆప లేదని గుర్తు చేశారు. దళితుల అభివృద్ధి కోసం రూ.1200 కోట్లతో ప్రత్యేకంగా దళిత్ ఎన్పవర్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నదని పేర్కొన్నారు. కౌన్సిలర్లు అజయ్, నాయకులు దుర్గం శేఖర్, గంగాధర్, శై లేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, జూన్ 28: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే దళితుల అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, దళిత హక్కుల రాష్ట్ర నాయకుడు దాసండ్ల ప్రభాకర్ అన్నారు. స్థానిక అంబేద్కర్ చౌక్‌లో కేసీఆర్ చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి రూ.1200 కోట్లతో దళిత క్రాంతి పథకం తీసుకరావ డం సంతోషంగా ఉందన్నారు. పీఏసీఎస్ చైర్మన్ ఎస్పీరెడ్డి, వైస్ ఎంపీపీ బాలాజీ, నాయకులు పోషన్న, భీం రావు, కాటం రమేశ్, ప్రజ్ఞాశీల్, మంచెద్రావు, కేంద్రే రమేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
ఇచ్చోడ జూన్ 28: దళితుల సంక్షేమానికి ముఖ్యమం త్రి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఇచ్చోడ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి అన్నారు. దళిత సా ధికారత పథకాన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తూ ఇ చ్చోడలో సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. సంక్షేమ పథకాలను చూసి, ఓర్వలేకే విపక్షాలు ఆరోపణలు చే స్తున్నాయని మండిపడ్డారు. ఎంపీపీ నిమ్మల ప్రీతం రె డ్డి, మండల ఉపాధ్యక్షుడు ముస్తాఫా, సుభాష్ పాటిల్, లోక శిరీశ్ రెడ్డి, అజీమ్, దాసరి భాస్కర్, గంగయ్య, శివన్న, వెంకటేశ్, లతీఫ్, భీముడు ఉన్నారు.