పెంచికల్ పేట్, అక్టోబర్ 29 : మండలంలోని మారుమూల గిరిజన గ్రామం మొర్లిగూడలో గల ప్రాథమిక పా ఠశాలలో 28 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాల కాగా.. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లాడు. దీంతో రెగ్యూలర్ ఉపాధ్యాయుడు లేడు. రొజుకొకరిని విద్యాశాఖ అధికారులు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో డిప్యూటేషన్ ఉపాధ్యాయుడు రమాకాంత్ ఉదయం 9 గంటలకు పాఠశాలను తెరిచి, పగలు 12 గంటలకు పాఠశాలను బందు చేసి విద్యార్థులను ఇంటికి పంపించి అతను ఇంటికి వెళ్లాడు.
మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్న విద్యార్థులను గ్రామస్తులు అడుగగా ‘ఉపాధ్యాయుడు వెళ్లిపోయాడు అందుకే మేము ఇంటికి వెళ్తున్నామని గ్రామస్తులకు విద్యార్థులు తెలిపారు. దీనిపై ఎంఈవో రమేశ్ బాబును వివరణ కోరగా.. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఇప్పటివరకు ఆ పాఠశాలకు నూతన ఉపాధ్యాయుడు జాయిన్ కాలేద ని, అందుకోసం అగర్‌గూడ పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరిని డిప్యూటేషన్‌పై పంపిస్తున్నామని అన్నారు. మొర్లిగూడ ప్రాథమిక పాఠశాలకు శాశ్వత ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతున్నారు.