
నిర్మల్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
గ్రామాల్లో కాంటాలు ఏర్పాటు చేసి సేకరణ
ఆదిలాబాద్, అక్టోబర్ 27 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ఏటా రెండు సీజన్లలో మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తున్నది. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 5.10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసిన వ్యవసాయ శాఖ అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పంట కోతలు ప్రారంభం కాగా, బుధవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూర్‌లో బుధవారం రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కొనుగోళ్లను ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలతో వ్యవసాయం లాభసాటిగా మారింది. ఉమ్మడి జిల్లాలో రైతు లు పత్తి తర్వాత వరిని ఎక్కువగా సాగు చేస్తా రు. ఇప్పటికే పత్తి కొనుగోళ్లు జరుగుతుండగా, బుధవారం ధాన్యం కొనుగోళ్లు సైతం ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూర్‌లో రాష్ట్ర దేవాదాయ, అట వీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వడ్ల కొనుగోళ్లను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో వానకాలం సీజన్లో 2,80, 853 ఎకరాల్లో వరి సాగు చేశారు. నిర్మల్ జిల్లాలో 1,15,000 లక్షల ఎకరాలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 51,623 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 1,14,230 ఎకరాల్లో పంట సాగవుతున్నది. ఇప్పటికే పలు ప్రాం తాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5.10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మంచిర్యాల జిల్లా లో 2.30 లక్షల మెట్రిక్ టన్నులు, నిర్మల్ జిల్లాలో 1.88 మెట్రిక్ టన్నులు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 92 వేల మెట్రిక్ టన్ను పంట మార్కెట్‌కు రానుంది.
గ్రామాల్లోనే కాంటాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు ఐకేపీ సంఘాలు, పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌ల ద్వా రా గ్రామాల్లో 485 కేంద్రాల్లో కాంటాలు పెట్టి మద్దతు ధరతో వడ్లను కొనుగోలు చేయనున్నా రు. నిర్మల్ జిల్లాలో 182 కేంద్రాలు, మంచిర్యాలలో 230 సెంటర్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 70, ఆదిలాబాద్ జిల్లాలో 3 పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ధాన్యానికి క్వింటాలుకు మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి రూ.1960, బీ గ్రేడ్‌కు రూ.1940 ప్రకటించింది. జిల్లాలో ఏ గ్రేడ్ ధాన్యం అమ్మకానికి వస్తుంది. దీంతో రైతులు మొదటి రకం వడ్ల ధర లభించనున్నది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లతో పాటు కరోనా నిబంధనలు పాటించేలా చూడనున్నారు.