
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఆలూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
సారంగాపూర్, అక్టోబర్ 27: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. వ్యవసాయరంగానికి ఉచితంగా 24 గంటల కరంట్, పెట్టుబడి సాయం, రైతు బీమా, మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ, తదితర కార్యక్రమాలతో రైతులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు.యాసంగిలో వరి సాగు తగ్గించి శనగలు, మినుములు, పెసర, పొద్దుతిరుగుడు, జొన్న తదితర పంటలు వేసుకోవాలని కోరారు. ఈ పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు హేమంత్ బొర్క డే, రాంబాబు, డీసీవో శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రఘునందన్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లావెంకట్ రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగరవీందర్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, వైస్ ఎంపీపీ పతాని రాధ, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్‌రెడ్డి, సర్పంచ్‌లు దండు రాధ, మురళీకృష్ణ, నాయకులు అల్లోల మురళీధర్‌రెడ్డి, రాజ్‌మహ్మద్, శ్రీనివాస్‌రెడ్డి, భూమేశ్, లక్ష్మీనారాయణ, దండుసాయి కృష్ణ పాల్గొన్నారు.
కార్మికుల సేవలు వెలకట్టలేనివి
నిర్మల్ అర్బన్, అక్టోబర్27 : పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీడీఎంఏ అందజేసిన దుప్పట్లు, ఎల్ఈడీ బల్బులను పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు బుధవారం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, పూదరి రాజేశ్వర్, నాయకులు అడ్ప పోశెట్టి, శ్రీధర్, నామెడ గజేందర్, మాజీ కౌన్సిలర్ ఆకోజి కిషన్, బంగల్పేట్ ఆలయ చైర్మన్ గంగాధర్, అప్పాల వంశీ, రవి, రఘు, పూదరి శివ పాల్గొన్నారు.
పొన్కల్‌లో కుమ్రం భీం విగ్రహావిష్కరణ
మామడ,అక్టోబర్27 : కుమ్రం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌లో ఏర్పాటు చేసిన కుమ్రం భీం విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. భీం ఎంతో ధైర్యశీలి, త్యాగశీలి అన్నారు. సదర్మాట్లో భూములు కోల్పోయిన రైతులకు రూ.38 కోట్లు చెల్లించామని, మరో రూ.5కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భూమేశ్వర్, ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్ హరీశ్ కుమార్, ఆదివాసీ నాయకపోడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమయ్య, జిల్లా అధ్యక్షుడు మొసలి చిన్నయ్య, వైఎస్ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి, ఎంపీడీవో మల్లేశం, ఎమ్మారో కిరణ్మయి, నాయకులు జైసింగ్, నవీన్‌రావు,ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.