
బోథ్, అక్టోబర్ 27: టీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎంపీపీ తుల శ్రీనివాస్, పార్టీ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్‌సింగ్ పిలుపు నిచ్చారు. పొచ్చెర క్రాస్‌రోడ్డు సమీపంలోని సాయికాన్ఫరెన్స్ హాలులో ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విజయగర్జన సభపై చర్చించడానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆధ్వర్యంలో ఈ నెల 29న సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొమ్మిది మండలాల్లోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండల కన్వీనర్లు, మార్కెట్ కమిటీ, సహకార సంఘం, ఆత్మ చైర్మన్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, పార్టీ గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీల అధ్యక్షులు, మహిళా సంఘాల బాధ్యులు, కార్యకర్తలు హజరు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ ఎం సుభాష్, వైస్ ఎంపీపీ రాథోడ్ లింబాజీ, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, చట్ల ఉమేశ్, గొడం జుగాదిరావు, రోహిదాస్, మహిపాల్, ఎలుక రాజు, సోలంకి సత్యనారాయణ, ఎస్ వెంకటరమణ పాల్గొన్నారు.
భీంపూర్,అక్టోబర్27: బోథ్ మండలం పొచ్చెరలో శుక్రవారం నిర్వహించనున్న టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి భీంపూర్,తాంసి మండలాల నుంచి పార్టీ శ్రేణులు హాజరుకావాలని జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి రాజు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. సర్పంచ్‌లు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీల బాధ్యులు, రైతుబంధు సమితుల అధ్యక్షులు హాజరుకావాలని పేర్కొన్నారు.
నేరడిగొండ, అక్టోబర్ 27 : వరంగల్‌లో నిర్వహించనున్న విజయగర్జన సభను విజయవంతం చేయడానికి బోథ్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి తెలిపారు. బోథ్ మండలంలోని సాయి కాన్ఫరెన్స్ హాల్ పొచ్చెరలో ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. మండలంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్లు, పార్టీ గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తప్పకుండా హాజరుకావాలని కోరారు.