
ఇచ్చోడ, అక్టోబర్ 27 : మండలంలోని గుం డాల గ్రామంలో బుధవారం ఇరు వర్గాల మ ధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దరు మృ తి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉం డడంతో హైదరాబాద్‌కు తరలించారు. మరో ముగ్గురు మహిళలతో పాటు ఏడుగురికి గా యాలయ్యాయి. ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలు ప్రకారం.. ఒ కే సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ అబ్దుల్ రషీద్ ఒక వర్గానికి, ఎంపీటీసీ కుటుంబానికి చెందిన మోబిన్ మరొక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. వీరి మధ్య కొన్నేళ్లుగా రాజకీయ కక్షలు ఉన్నాయి. గ్రామంలో బుధవారం ఉదయం సర్పంచ్ వర్గం ఉర్సు సందర్భంగా డీజేతో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్ర మంలో ఎంపీటీసీ వర్గీయులు అనుమతి లే కుండా ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నా రని నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని ఎంపీటీసీ వర్గీయు లు పోలీసులకు సమాచారం అం దించారు. దీంతో పోలీసులకు సమాచారం అందిస్తారా అంటూ సర్పంచ్ వర్గీయులు కో పంతో కర్ర లు, గొడ్డళ్లు, కత్తులతో దాడులు చేశారు. దాడి లో ఎంపీటీసీ వర్గీయులైన ఇద్దరు అన్నదమ్ము లు షేక్ జహీరొద్దీన్ (60), తమ్ముడు షేక్ ఝా న్ (55) అక్కడికక్కడే మృ తి చెందారు. షేక్ సిరాజ్ పరిస్థితి విషమం గా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. గా యపడ్డ షేక్ గు లామ్, షేక్ అజీత్, షేక్ వసీమ్, షేక్ రబీ యా బీ, సలీమా బీ ను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టం కో సం బోథ్ సర్కారు దవాఖానకు తరలించారు.
కఠిన చర్యలు తీసుకుంటాం:ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర
దాడులకు పాల్పడిన సర్పంచ్ వర్గీయులను అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి ఎస్పీ తెలిపారు. సకాలంలో పోలీసు లు రంగ ప్రవేశం చేసి అల్లరి మూకలను చెదరగొట్టి ఇరు వర్గాలను శాంతింప జేశామన్నారు. 23 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. ప్రశాం త వాతావరణం నెలకొల్పే వరకు సాయుధ పోలీసుల పికెటింగ్ కొనసాగుతుందని చెప్పా రు. గుండాల గ్రామంలో నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, అదనపు ఎస్పీ రాంరెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావ్, సీఐలు ర మేశ్ బాబు, కొంక మల్లేశ్, స్పెషల్ బ్రాంచ్ ఇ న్స్పెక్టర్ కృష్ణమూర్తి, సీసీఎస్ సీఐ చంద్రమౌళి, ఉట్నూర్ సీఐ సైదారావ్తో పాటు 20 మంది ఎస్ఐలు, 200 మంది సాయుధ బలగాలను మోహరించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఎంపీటీసీ వర్గం ఖాళీ..
యేటా సర్పంచ్ వర్గానికి చెందిన అనుచరులు గ్రామంలో ఉర్సు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం అనుమతులు ఇవ్వద్దని ఎంపీటీసీ వర్గానికి చెందిన వారు డీఎస్పీ, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీటీసీ భర్త మోబిన్ చెప్పారు. అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించడంతోనే సర్పంచ్ వర్గం వారు దాడి చేసి ఇద్దరిని పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణభయంతో ఎంపీటీసీ వర్గం, అతని అనుచరులు మొత్తం ఇండ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు.