
వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ డాక్టర్ ఎం మహేందర్ రెడ్డి
ఎదులాపురం/నిర్మల్ అర్బన్/గర్మిళ్ల,ఆగస్టు27: నేరాల నియంత్రణకు పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నామని డీజీపీ డాక్టర్ ఎం మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి డీజీపీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. వర్టికల్ విభాగంలో పోలీసులకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించడానికి నిరంతరం అధ్యయనం చేయాలన్నారు. జిల్లా పోలీసుల పనితీరుపై రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని, వర్టికల్ విభాగంలో పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. సైబర్ నేరాలను నియంత్రణకు అన్ని మండలాలు, గ్రామాల్లో ప్రజా సభలు నిర్వహించి చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. బాధితులు వెంటనే 155260 లేదా డయల్ 100కు ఫోన్ చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు బ్లాక్ స్పాట్లను గుర్తించి ఐరాడ్ యాప్‌లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో అదనంగా పెట్రోలింగ్, గస్తీ పెంచినట్లు తెలిపారు. విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో షీటీంలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ నాణ్యమైన సత్వర సేవలను అందించాలని సూచించారు. సమావేశంలో రామగుండం సీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు ఉదయ్ కుమార్ రెడ్డి, రవీందర్, రామ గుండం ట్రాఫిక్ ఏసీపీ బాల రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నారాయణ, ఆదిలాబాద్ అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాస్‌రావు, నిర్మల్ అడిషనల్ ఎస్పీ రాంరెడ్డి, ఆదిలాబాద్ డీసీఆర్బీ సీఐ జాదవ్ గుణవంత్ రావు, ఏవో వెంకట శేఖర్, ఆర్ఐ బీ శ్రీపాల్, సీఐలు శ్రీని వాస్, జీవన్ రెడ్డి, వెంకటేశ్, అజయ్ బాబు, చంద్రశేఖర్, ఆర్ఐలు వెంకటి, రమేశ్, కమ్యూనికేషన్ ఎస్ఐలు శ్రీలత, పీ గణేశ్, ఎస్ఐ ఎంఏ హకీం, ఐటీ కోర్ సిబ్బంది సింగజ్‌వార్, సంజీవ్ కుమార్, ఎస్కే మురాద్, గిన్నెల సత్యనారాయణ, శేఖర్ పాల్గొన్నారు.