
పూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
ఇంద్రవెల్లి, జూన్ 27 : గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలతోపాటు అభివృద్ధిలో వెనుకబడిన వారికి సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వం లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని పోలీస్‌స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ విద్యుత్ లైట్లను ఆదివారం మండల ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న అభివృద్ధి నిధులతో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కోరెంగా గాంధారి, పీఏసీఎస్ చైర్మన్ మారుతీపటేల్, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ మోహన్‌నాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎంఏ అమ్జద్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, కోవ రాజేశ్వర్, సర్పంచ్‌లు జాదవ్ లఖన్సింగ్, రాథోడ్ రాంచందర్, మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, బీసీ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి దేవ్‌పూజే మారుతి, నాయకులు షేక్ సుఫియాన్, బాబుముండే, వసంత్‌రావ్, రాందాస్, శ్రీనివాస్, కనక హనుమంత్‌రావ్, నవాబ్బేగ్, తదితరులు పాల్గొన్నారు.
నాగోబా ఆలయ పనుల పరిశీలన
ఇంద్రవెల్లి, జూన్27 : నాగోబా అభివృద్ధి పనులను ఆదివారం ఎమ్మెల్యే రేఖానాయక్ పరిశీలించారు. అందుబాటులో ఉన్న అధికారులతో పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాగోబా ఆలయం లోపల పార్కింగ్ టైల్స్ ఏర్పాటు, భక్తులతోపాటు వీఐపీల కోసం ప్రత్యేకమైన గదుల నిర్మాణం, హర్కాపూర్ ఎక్స్‌రోడ్డు నుంచి మల్లాపూర్‌కు బైపాస్‌రోడ్డు, ఆర్చిగేట్ నిర్మాణం చేయాలని ఎమ్మెల్యేకు మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆమె ఐటీడీఏ పీవోతో ఫోన్లో మాట్లాడారు. మెస్రం వంశీయులు విన్నవించిన నాగోబా ఆలయ అభివృద్ధి పనులపై ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మెస్రం రేణుకానాగ్‌నాథ్, మెస్రం వంశీయులు వెంకట్రావ్పటేల్, చిన్నుపటేల్, బాధిరావ్‌పటేల్, లింబారావ్, శేఖర్‌బాబు, దేవ్‌రావ్, సోనేరావ్, తుకారాం, నాగ్నాథ్, ఆనంద్‌రావ్, పీఏసీఎస్ చైర్మన్ మారుతీపటేల్, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ మోహన్‌నాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎంఏ అమ్జద్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, కోవ రాజేశ్వర్, సర్పంచ్‌లు జాదవ్ లఖన్సింగ్, రాథోడ్ రాంచందర్, మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, బీసీ సెల్ జిల్లా ప్రచారకార్యదర్శి దేవ్‌పూజే మారుతి, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు షేక్ సుఫియాన్, మండల నాయకులు కోరెంగా సుంకట్రావ్, బాబుముండే, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం
పెంబి, జూన్ 27: టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే అజ్మీరా రేఖనాయక్ అన్నారు. మండలంలోని లోతోర్యతండా, తాటిగూడ గ్రామాల్లో ఆదివారం సీసీ రోడ్ల ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన మెరునిపరు చెక్‌డ్యామ్‌ను సందర్శించారు. ప్రభుత్వం అనువైన ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో సాగునీటి కష్టాలు తీరాయన్నారు. చెక్‌డ్యాం పరిసర ప్రాంతాల్లో పూల మొక్కలు పెంచాలని అటవీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా కవిత, జడ్పీటీసీ జానుబాయి, టీఆర్ఎస్ మండల ఆధ్యక్షుడు పుప్పాల శంకర్, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ భూక్యా గోవింద్, సర్పంచ్‌లు శాంకీబాయి, పూర్ణచందర్ గౌడ్, రాజు, మహేందర్, ఎంపీటీసీ రామారావ్, నాయకులు విలాస్, రూప్సింగ్, సుతారి మహేందర్, విక్రమ్‌నాయక్, గాండ్ల శంకర్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఆలయాలకు మహర్దశ
ఖానాపూర్ టౌన్, జూన్ 27 : ఆలయాల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అన్నారు. పట్టణంలోని శ్రీరాం నగర్ కాలనీలోని బద్ది పోచమ్మ ఆలయ వార్షికోత్సవంలో పా ల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆమె వెంట హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాజమల్ల రాజశేఖర్, పార్టీ మండల అధ్యక్షు డు రాజ గంగన్న, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.