కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే చేతుల మీదుగా ఇండస్ట్రీ ఎక్స్‌లెన్స్ అవార్డు
స్వీకరించిన జీఎం (సీపీపీ) నాగభూషణ్‌రెడ్డి
సింగరేణీయుల హర్షాతిరేకాలు
శ్రీరాంపూర్, డిసెంబర్ 26: మైనింగ్ రంగంలో 13 దశాబ్దాల సుధీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థ అవలంబిస్తున్న అత్యుత్తమ వ్యాపార విలువలకు జాతీయ స్థాయిలో మరో పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మకమైన ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (ఐఈఐ) ఏటా ప్రకటించే ఇం డస్ట్రీ ఎక్స్‌లెన్స్ అవార్డు కోసం ఈ ఏడాది సింగరేణిని ఎంపి క చేసింది. ఐఈఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆదివారం నుంచి ప్రారంభమైన 36వ ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్‌లో ఈ అవార్డును ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే చేతుల మీదుగా సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ తరఫున జీఎం (సీపీపీ) కే నాగభూషణ్‌రెడ్డి ఈ అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐఈఐ అధ్యక్షుడు నరేంద్ర సింగ్ మాట్లాడుతూ శ్రేష్టమైన వాణిజ్య విలువలు పాటిస్తున్నందుకు ఈ అవార్డుకుఎంపిక చేసినట్లు తెలిపారు. అవార్డును స్వీకరించిన తర్వాత జీఎం (సీపీపీ) నాగభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ నేతృత్వంలో సంస్థ కేవలం బొగ్గు మైనింగ్ రంగంలోనే కాకుం డా 1200 మెగావాట్ల థర్మల్, 30 మెగావాట్ల సోలార్ రంగాల్లోకి విజయవంతంగా అడుగుపెట్టిందన్నారు. సీఎండీ సారథ్యంలో కంపెనీకి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించినట్లు పేర్కొన్నారు. మన్ముందు సంస్థ సీఅండ్ఎండీ మార్గనిర్దేశంలో దేశ సేవకు మరింత పునరంకితమై పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రెసిడెంట్ ఆఫీసర్ ఓజా, ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ దినేశ్ కుమార్, ఐఈఐకి చెందిన డాక్టర్ హెచ్‌వో థాకరే, మేజర్ జనరల్ ఎంజేఎస్ సైలీ, ఆర్ఎన్ రాజ్‌పుత ప్రవీణ్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.
ఏడేళ్లలో సింగరేణికి అవార్డుల పంట..
గత ఏడేళ్లుగా సంస్థ సీఎండీ శ్రీధర్ సారథ్యంలో ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణాలతో పాటు లాభాల్లో సింగరేణి రికార్డులు సృష్టించింది. అలాగే కార్మిక సంక్షేమానికి పెద్ద పీట వేసింది. సంస్థ సాధించిన ప్రగతి, అభివృద్ధిని గుర్తిస్తూ జా తీయ అంతర్జాతీయ సంస్థలు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందజేశాయి. వీటిలో ఆసియా పసిఫిక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అవుట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్ షిప్, ఎక్స్‌లెన్స్ ఇన్‌కాస్ట్ మేనేజ్మెంట్, బెస్ట్ మేనేజ్మెంట్, ఏషియా మోస్ట్ ట్రస్ట్డ్ కంపెనీ, ఎక్స్‌లెన్స్ ఇన్ పర్ఫార్మెన్స్, పర్యావరణ హి త చర్యలకు గుర్తింపుగా గోల్డెన్ పీకాక్ వారి ఇన్నోవేటివ్, సీఎస్ఆర్ అవార్డులు ఉండడం విశేషం. సంస్థ సాధిస్తున్న ప్రగతికి జాతీయ స్థాయిలో అవార్డులు వస్తుండడంపై కార్మికులు, నాయకులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.