
కుభీర్, సెప్టెంబర్ 26 : అనారోగ్యం పాలై ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స పొంది అప్పుల పాలైన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవ డం వరమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. ముథోల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుభీర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన బాధితులకు రూ.4.74 లక్షల విలువైన ఆర్థిక సహాయం చెక్కులను ఆదివారం మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముథోల్ నియోజక వర్గానికి ఏడేండ్లలో సీఎంఆర్ఎఫ్ ద్వారా కోట్లాది రూపాయలు అందించామని తెలిపారు. ముందెన్నడూ ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందిన దాఖలాలు లేవన్నారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. రెండేండ్లు కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చతికిలపడ్డా ఏలోటూ రానీయలేదని కొనియాడారు. అనంతరం కుభీర్‌తో పాటు పార్డి(బీ), గోడ్సర, డోడర్న, నిగ్వ, సాంగ్వికి చెందిన 15 మందికి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, పార్టీ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్, కుభీర్ టౌన్ ప్రెసిడెంట్ బొప్ప నాగలింగం, సింగిల్‌విండో చైర్మన్ రేకుల గంగాచరణ్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, మార్కెట్ చైర్మన్ కందుర్ సంతోష్, నాయకులు గోనే కల్యాణ్, సూది రాజన్న, ధర్మ కిరణ్, శేరి సురేశ్, జీ రమేశ్, మిలింద్, గంగయ్య తది తరులు పాల్గొన్నారు.
దశలవారీగా సమస్యల పరిష్కారం..
కుంటాల, సెప్టెంబర్, 26 : కుంటాల మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల టీఆర్ఎస్ నాయకులు ముథోల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. కుంటాల బస్టాండ్ నుంచి అంబకంటి రహదారిపై ఉన్న మహాలక్ష్మీ ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణం, ఓల మూల మలుపు నుంచి దౌనెల్లి రహదారిపై ఉన్న శ్మశాన వాటిక వరకు రహదారి మరమ్మతుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. మండల పార్టీ కన్వీనర్ పడకంటి దత్తు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఒడ్నం రమేశ్, ఏఎంసీ, ఆత్మ డైరెక్టర్లు సబ్బిడి గజేంధర్, ప్యాదరి భూమన్న, నాయకులు దోనిగామ రాజ్‌కుమార్, సంతోష్, ముత్యం, రాకేశ్, బోనగిరి ఉదయ్, మానాజీగారి గజేంధర్, తదితరులున్నారు.