
ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
నార్నూర్, గాదిగూడ మండలాల్లో పర్యటన
నార్నూర్, ఆగస్టు 26: దళితుల సంక్షేమానికి ము ఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. పాటు గాదిగూడ మండలంలోని కొలామా, మారేగావ్ గ్రామంలో గురువారం మతంగ్ సమాజ్ ఆధ్వర్యంలో, నార్నూర్ మండల కేంద్రంలో అన్నాబా వుసాటే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ హాజరై మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం ఏ ర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజానంద్మౌళి మహారాజ్, ఎంపీపీ ఆడ చంద్రకళరాజు,వైస్ ఎంపీపీ యోగేశ్, ఎంపీటీసీ లక్ష్మీబాయి, దళిత హ క్కుల సాధన కమిటీ ఉమ్మడి మండలాధ్యక్షుడు శేఖర్ జాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఇన్సూఅక్బానీ,బాబు, దయానంద్ తదితరులున్నారు. నార్నూర్‌లో సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్, భీంపూర్ సర్పంచ్ రాథోడ్ విష్ణు, సహకార సం ఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, బ్రిజ్జిలాల్, నర్సింగ్ మోరే, మహేందర్, రాజు, పాల్గొన్నారు.
పాఠశాలలను సిద్ధం చేయాలి
పాఠశాలల పునఃప్రారంభం రోజున పండుగ వాతావరణం కల్పించాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. నార్నూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం సందర్శించారు. పాఠశాలలోని సమస్యలు ప్రధానోపాధ్యాయుడు సుభాష్‌ను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య, శానిటైజేషన్ పనులు పరిశీ లించారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి పాఠశాలలకు నీటి వసతిని కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో మౌలిక వసతు లు కల్పించాలన్నారు. అనంతరం విద్యాశాఖ జి ల్లా అధికారి రవీందర్‌రెడ్డితో వీడియోకాన్ఫరెన్స్‌లో మా ట్లాడారు. మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దృష్టికి తేవాలని, మిషన్ భగీరథ అధికారులతో సమావేశం ఏర్పా టు చేసి చర్చిస్తామని తెలిపారు. సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్, సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడె సురేశ్, భీంపూర్ సర్పంచ్ రాథోడ్ విష్ణు, నాయకులు హైమద్, మహేందర్, ఫెరోజ్‌ఖాన్, ఉపాధ్యాయులు ఉన్నారు.