నిర్మల్ అర్బన్, అక్టోబర్ 18 : నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. కొరిపెల్లి రేణుకా దేవి తమ బంధువుల పుట్టిన రోజు వేడుకలకు స్థానిక శాస్త్రినగర్ కాలనీకి వెళ్లింది. ఇంటికి తాళం వేసి ఉండడం, ఎవరు లేని ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు.. ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న వస్తువులు చిందర వందరగా పడేశారు.
అందులో ఉన్న 26 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.ఐదు వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితురాలు పోలీసులకు సమాచారం అందించగా.. క్లూస్ టీం సభ్యులు వేలిముద్రలు సేకరించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.