
నేరడిగొండ, డిసెంబర్ 25 : మండల కేంద్రంలో అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో శనివారం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు గణపతి హోమం, కలశ పూజ, స్వామికి పల్లకీ సేవ, గిరిప్రదక్షిణ నిర్వహించారు. అయ్యప్ప మాలధారులు, భక్తుల శరణుఘోషతో ముంచెత్తింది. గురుస్వాములు ఆలపించిన భక్తిగీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్, వీడీసీ చైర్మన్ ఏలేటి రవీందర్రెడ్డి, గురుస్వాములు ప్రవీణ్, భూమేశ్, రవీందర్రెడ్డి, తేజాపూర్, బుగ్గారం, వడూర్ గ్రామాల స్వాములు పాల్గొన్నారు.
నిపానిలో
భీంపూర్, డిసెంబర్ 25 : స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాములు శరణు ఘోష చేశారు. నిపాని గ్రామంలో అయ్యప్ప స్వామి సామూహిక పడిపూజ నిర్వహించారు. జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజు, లావణ్య దంపతులు , భీంపూర్ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, సర్పంచ్ భూమన్న, ఉపసర్పంచ్ ప్రమీల, నాయకులు రాజన్న, అనిల్, స్వాములు పూజలు చేశారు.
ఉట్నూర్లో ఆరట్టు ఉత్సవం
ఉట్నూర్, డిసెంబర్ 23: మండల కేంద్రంలో అయ్యప్ప మాలధారులు నిర్వహించిన ఆరట్టు ఉత్సవం కనుల విందుగా సాగింది. ఆలయం నుంచి అయ్యప్ప, కుమారస్వామి, వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిర్మల్ జిల్లా బాదంకుర్తి గంగలో అభిషేకాలు చేసి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఆలయ పూజారి దీపక్ దూబే, గురుస్వాములు నందిరెడ్డి, రవి, శ్రీనివాస్, శ్రీధర్, ప్రసన్న పాల్గొన్నారు.