
దిలావర్పూర్, డిసెంబర్ 25 : ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ ఓక్క పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరి వాడని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని కదిలి గ్రామంలో ఆర్య మరాఠ సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని శనివారం ఆయన అవిష్కరించారు. అంతకుముందు నర్సాపూర్(జీ)లో నిర్మల్- భైంసా జాతీయ రహదారిపై రూ.53 లక్షల పంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను, అదే గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణ పోరాట యోధులైన చాకలి ఐలమ్మ, శివాజీ విగ్రహాలను గ్రామాల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నిర్మల్-భైంసా జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా ఏర్పాటు చేయడంతోనే సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేశామని, ఈ పనులు చేసిన సర్పంచ్‌ను అభినందించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం నిర్వహించకపోగా, అభివృద్ధి చేస్తున్న తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ నాయకులు విమర్శించడం తగదన్నారు. జాయింట్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎంపీపీలు కొండ్రు రేఖ, బాబురావు, సర్పంచులు రాంరెడ్డి, సరిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, జడ్పీటీసీ అర్గుమీది రామయ్య, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు గంగారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఫసి, కదిలి ఆలయ చైర్మన్ పీవీ భుజంగ్‌రావు, ఆలయ మాజీ చైర్మన్ సంబాజీపటేల్, ఎంపీటీసీలు పాల్ధే అక్షర, అనిల్, గుణవంత్‌రావు, రాజు, మారుతీ పటేల్, దత్తుపటేల్, ఆనంద్‌రావు, ఛత్రపతి శివాజీ సంఘం సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులున్నారు.
మంత్రిని కలిసిన ఎస్పీ..
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 25 : నిర్మల్ ఇన్చార్జి ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నాన్ క్యాడర్ ఐపీఎస్ హోదా పొంది పూర్తిస్థాయి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ ప్రవీణ్ కుమార్ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని క్యాంపు కా ర్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రికి పూల మొక్కను అందజేశారు. జిల్లా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందిస్తామన్నారు.
మానవ జాతికి ఆదర్శం ఏసు ప్రభువు
నిర్మల్ అర్బన్ / సోన్, డిసెంబర్ 25 : మానవ జాతికి ఆదర్శం ఏసు ప్రభువు అని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా పట్టణంలోని పలు చర్చిల్లో పాల్గొని క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగను ప్రభుత్వం ఘనంగా నిర్వహించడంతో పాటు పేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్‌ల ద్వారా నూతన వస్ర్తాలను అందించిదని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నర్మదా ముత్యంరెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీకాంత్, సంపంగి రవి, గొనుగోపుల నర్సయ్య, విజయ్, చర్చిల ఫాదర్లు పాల్గొన్నారు. సోన్‌లోని ఐబీ వద్ద ఉన్న చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురికి గిఫ్ట్‌ప్యాక్‌లు అందజేశారు. సోన్ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, సోన్ సర్పంచ్ తిరుక్కోవెల వినోద్, ఫాస్టర్ చంటి పాల్గొన్నారు.