
సభ్యత, సంస్కారంలేని, దిగజారుడు జూటా పార్టీ
విలువలులేని వారిని చేర్చుకుంటూ ప్రజల్లో చులకన
పిల్లల బాడీషేమింగ్ చేసిన తీన్మార్ మల్లన్నపై ఆగ్రహజ్వాలలు
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలపై కన్నెర్ర
మానుకోకపోతే తగిన బుద్ధిచెబుతామని జిల్లావాసుల హెచ్చరిక
ఆదిలాబాద్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;బీజేపీ నేతలారా మీరు దిగి‘పోయే’ సమయం ఆసన్నమవుతోంది.. దేశవ్యాప్తంగా మీ ప్రాభవం తగ్గుముఖం పడుతోంది.. రాజకీయ చతురత కలిగిన కేసీఆర్ వైపు దేశం చూస్తున్నది..ఈ యాల్ల మళ్లీ ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. ఇదేనా మీ దిగజారుడు రాజకీయం..! కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక.. ఆయన కుటుంబంపై బురదజల్లుడు రాజకీయాలు చేస్తున్నారు. సభ్యత, ఇంగిత జ్ఞానం, మానవతా విలువలు లేని, తప్పుడు కూతలు కూస్తున్న తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) వంటి థర్డ్ రేట్ చీటర్స్‌ను పార్టీలో చేర్చుకొని చులకన అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అసత్యప్రచారాలు చేయిస్తున్నారు. మీరు మానుకోకపోతే ప్రజలే బుద్ధిచెబుతారు. ఖబడ్డార్ కమల నాథులారా..
కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేని బీజేపీ నాయకులు ఆయనను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ.. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. జర్నలిజం ముసుగులో తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) రెచ్చిపోతున్నాడు. ఇప్పటికే 75 రోజులు జైలు జీవితం గడిపివచ్చాడు. ఇలాంటి వ్యక్తిని తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ నాయకులు సమాజానికి ఏమని సందేశం ఇస్తున్నారని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేని చిన్న పిల్లవాడిని వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నించడం బీజేపీ నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనమని మరో పక్క టీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేకనే..
తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజలతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేకనే బీజేపీ నాయకులు పార్టీ అధినేత కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వ్యక్తులను టార్గెట్ చేయడం ద్వారా బీజేపీ నాయకులు ఎంత నీచానికి దిగజారుగుతున్నారో మంత్రి కేటీఆర్ కుమారుడిపై ట్విట్టర్లో చేసిన పోస్టు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులను వ్యక్తిగతంగా విమర్శించే వాళ్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వ్యక్తుల నైతికత, వారి చరిత్రను పరిగణలోకి తీసుకోకుండానే పార్టీలో చేర్చుకుంటున్నారు. అందులో ఒకడే తీన్మార్ మల్లన్న. జర్నలిజం ముసుగులో టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ కుటుంబంపై అంతుతంతూ లేని ఆరోపణలు చేసినందుకు, సెటిల్మెంట్ల దందాల్లో తల దూర్చినందుకు పోలీసులు చట్టరీత్యా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. తన ఉనికి కాపాడుకునేందుకు బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న రెచ్చిపోయి చిన్న పిల్లలను కూడా టార్గెట్ చేసి అబాసు పాలవుతున్నాడు.
తీన్మార్ మల్లన్నకు తగిన బుద్ధి చెబుతాం..
సోషల్ మీడియాను వాడుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులపై అసత్య ప్రచారాలు ప్రచారం చేస్తున్న తీన్మార్ మల్లన్న తన విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇంగిత జ్ఞానం, మానవతా విలువలు లేకుండా తప్పుడు కూతలు కూస్తున్న చింతపండు నవీన్‌ను ఏమనాలి? బీజేపీ నాయకులు ఇలాంటి వారిని తమ పార్టీలోకి చేర్చుకుంటూ ప్రజల్లో చులకన అవుతున్నారు. గులాబీ సైన్యం తలచుకుంటే బీజేపీ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదు.
-దీపక్ గాడ్గే, ముక్రా (కే), ఇచ్చోడ మండలం.
ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు
టీఆర్ఎస్ అగ్రనేతలపై అసత్య ప్రచారానికి దిగుతున్న బీజేపీ నేతలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. నాయకు లు విలువలకు కట్టుబడి ఉండాలి. సమాజంలో ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. టీఆర్ఎస్కు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూసి బీజేపీ నాయకులు కొందరు పనికిమాలిన వారితో సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలి.
ప్రజలు విశ్వసించరు
నిర్మల్ టౌన్, డిసెంబర్ 25 : సోషల్ మీడియా అనేది సమాజ హితానికి ఉపయోగపడాలి. కానీ తీన్మార్ మల్లన్న ఉదయం నుంచి రాత్రి వరకు సమాజంలో గౌరవమున్న వ్యక్తులను కించపరిచేందుకు వాడుకుంటున్నాడు. యూట్యూబ్ చానల్ ద్వారా అసత్యప్రచారాలు చేస్తున్నాడు. అతడిని ప్రజలు విశ్వసించరు. ఈ ఐదారు నెలల్లో అనేక బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డాడు. బీజేపీ అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకొని విలువ తీసుకుంటుంది.
-చిన్నయ్య, చిట్యాల్
దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి..
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. కనీస విలువలు లేని చింతపండు నవీన్ వంటి వాళ్లను పార్టీలో చేర్చుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ నాయకులు, వారి కుటుంబసభ్యులపై దుష్ర్పచారం చేయిస్తున్నారు. మల్లన్న నోరు అదుపులో పెట్టుకో. లేకపోతే తగిన గుణపాఠం చెబుతాం. ఇప్పటికైనా నీ విధానాలు మార్చుకోకపోతే ఘాటుగా స్పందిస్తాం. సిగ్గుమాలిన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ నాయకులు టీఆర్ఎస్ అభిమానుల ఆగ్రహానికి గురవుతారు. ఖబడ్డార్.
-శివకుమార్, ఆదిలాబాద్.