
ఎదులాపురం, డిసెంబర్ 25 : రాష్ట్రంలోని అన్ని కులాల అభ్యున్నతి టీఆర్ఎస్తోనే సాధ్యం అవుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, పిట్టలవాడ సమీపంలో రూ.50 లక్షలతో నిర్మించిన మోడల్ దోభీఘాట్‌ను ఎమ్మె ల్యే జోగు రామన్న ప్రారంభించారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత మొదటిసారి ఎమ్మెల్యే అయి, బీసీ సంక్షేమ మంత్రిగా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారని పేర్కొన్నారు. సంచార జాతులను గుర్తించి వారిని బీసీ-ఏలో చేర్చినట్లు చెప్పారు. వరంగల్, హైదరాబాద్‌లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌ను జిల్లా కేంద్రంలో రూ.3 కోట్లతో ఏర్పాటు చేసుకున్నామన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. రజకులు, నాయీబ్రాహ్మణ కులస్తులకు ప్రతి నెలా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టి 880 మందికి లబ్ధి చేకూర్చుతున్నామని పేర్కొన్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని ఎనిమిది మోడల్ దోభీఘాట్లను మంజూరు చేశామని, ఇందులో ఆదిలాబాద్ ఒకటన్నారు. ప్రస్తుతం ఒకటి ఉందని, అవసరమనుకుంటే మరోటి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జోగు ఫౌండేషన్ నుంచి ఉచితం గా ఇస్త్రీ పెట్టెలను ఇస్తామని చెప్పారు. స్టార్వైవ్ కంపెనీ ప్రతినిధి మోడల్ దోభీఘాట్ పనితీరును వివరించారు. సంఘాల నాయకులు తమ సమస్యలు ఎమ్మెల్యేకు విన్నవించగా, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే, సంఘం నాయకులను రజకులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అభివృద్ధి అధికారి రాజలింగు, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, పట్టణ ఉపాధ్యక్షుడు దివిటి రాజు, మాజీ జడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కల దత్తు, వార్డు కౌన్సిలర్లు భరత్, సంగీత, అర్చన, పవన్‌నాయక్, బండారి సతీశ్, కొండ గణేశ్, కో ఆప్షన్ సభ్యుడు ఏజాజ్, నాయకులు మిట్టపూరి యోగేశ్, నారాయణ పాల్గొన్నారు.
కాలనీల అభివృద్ధే ప్రధాన ధ్యేయం..
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 25 : పట్టణంలోని 49 వార్డుల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే జోగు రామ న్న అన్నారు. పట్టణంలోని పిట్టల వాడలో రూ.1.80 కోట్లతో బీటీ రోడ్డు, రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ఆయన ప్రా రంభించారు. పట్టణంలో కాలనీలను అభివృద్ధి చేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. కోట్లాది రూపాయల తో అభివృద్ధి పనులు ఎంతో చురుగ్గా సాగుతున్నాయన్నారు. మున్సిపాలిటీలో రోడ్లవెడల్పు, డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ప నులు దాదాపు పూర్తయ్యాయన్నారు. ప్రజారోగ్యాలను దృష్టిలో ఉంచుకొని పార్కులతో పాటు ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశాన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు అజయ్, సంగీత, ధమ్మపాల్, బండారి సతీశ్, ఎజాజ్ పాల్గొన్నారు.