
సంప్రదాయ పాటలపై ఆడిపాడిన యువకులు, మహిళలు
దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే
నృత్యం చేస్తూ ఉత్సాహపర్చిన రాథోడ్ బాపురావ్
పెద్దసంఖ్యలో తరలివచ్చిన వివిధ రాష్ర్టాల భక్తులు
బజార్హత్నూర్ మండలంలోనూ కొనసాగిన ఉత్సవాలు
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 25 : ఇంద్రవెల్లి పంచాయతీ పరిధిలోని అంధునాయక్తండాలో జ్వాలాముఖిదేవి, కాళుబాబా, పచుబాబా ఆలయ ఆవరణలో రాంసింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో రుషి పంచమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రా ష్ట్రంతో పాటు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి మథురా సమాజ్ (లభాన్) కులస్తులు తరలివచ్చారు. యు వకులు, మహిళలు వేర్వేరుగా సంప్రదాయ నృ త్యం చేశారు. జ్వాలాముఖిదేవి, కాళుబాబా, పచుబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాంసింగ్ మహరాజ్‌ను దర్శించుకొని ఆశీర్వాదం పొందారు. కుల పెద్దలు ఆల య ఆవరణలో సంప్రదాయ పచ్చిస్ ఆట ఆడా రు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ జ్వలాముఖిదేవి, కాళుబాబా, పచుబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువకులతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చోపాడే బద్దుసింగ్, పడ్వాల్ గోపాల్‌సింగ్, గేబిసింగ్, షేర్సింగ్, కులపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, సెప్టెంబర్ 25 : మండలంలోని మంజీరామ్తండా, చందునాయక్తండాల్లో వేడుకలు నిర్వహించారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ నృత్యం చేస్తూ గ్రామస్తులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజారాం, మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు సర్పే సోంబాయి, బోథ్ ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు చందర్‌సింగ్, అనిత, వైస్ ఎంపీపీ నిస్తే కైలాస్సింగ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు రియాజ్‌ఖాన్, ప్రభు, ఉత్తం, అంకుస్, తుడుందెబ్బ మండలాధ్యక్షుడు సాయన్న, చంద్రశేఖర్, తులసీరాం, శంకర్‌గౌడ్, శ్రీనివాస్, ఈశ్వర్, నర్సారెడ్డి, రాజేశ్వర్, గణపతి మహరాజ్, లక్ష్మణ్, పడ్వాల్రాజు పాల్గొన్నారు.