
ఎదులాపురం, సెప్టెంబర్ 25 : న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన కేసులను త్వరగా పూర్తిచేసేందుకు సరైన సమయంలో సాక్షులను ప్రవేశపెట్టాలని ప్రాసిక్యూషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ కే అజయ్ అన్నారు. హైదరాబాద్ నుంచి శనివా రం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విభాగం అధికారులతో కలిసి జిల్లా పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిమినల్ కేసుల నమోదు అనంతరం పోలీసు అధికారులు దర్యా ప్తు సమయంలో సాక్ష్యాల సేకరణ, సంఘటనా స్థలాన్ని క్షుణ్నంగా పరిశీలించడం, వేలిముద్రల సేకరణ, ప్రత్యేక సాక్షుల వాంగ్మూలాలు, కీలకం గా ఉంటాయన్నారు. తుది నివేదిక చార్జిషీజ్ స మయంలో కేసుకు సంబంధించిన ప్రధాన అం శాలను పటిష్టంగా సిద్ధం చేయాల్సి ఉంటుందని తెలిపారు. కోర్టు కేసుల్లోని నిందితులు ఇతర దేశాల్లో ఉంటే రప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. న్యా యస్థానం సమయాన్ని వృథాచేయకుండా సాక్షులను, నిందితులు జైల్లో రిమాండ్‌లో ఉంటే ప్ర త్యేక ఎస్కార్ట్ ద్వారా ప్రవేశపెట్టాలని వివరించా రు. అనంతరం ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజే శ్ చంద్ర మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో తీసుకోవాల్సిన అంశాలపై ఎప్పటికప్పుడు ప్రాసిక్యూషన్ విభాగం వారితో తెలుసుకునే ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నట్లు తెలిపారు. నమోదైన ప్రతి కేసూ న్యాయస్థానంలో రుజువచ్చేందుకు ప్రణాళికా ప్రకారం దర్యాప్తు ఉంటుందన్నారు. భౌతిక సాక్షం విఫలమైతే, సాంకేతిక పరిజ్ఞానంతో రుజు వు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. వేలి ముద్రల నిపుణులు, కంప్యూటర్ ఐటీ కోర్ సిబ్బంది, డాగ్ స్కాడ్ సైంటిఫిక్ లేబరేటరీ, సీసీటీవీ కెమెరాలు తదితర అనేక అంశాలు దర్యాప్తులో సహకారం అందిస్తాయన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్‌లో డీఎస్పీ వెంకటేశ్వర్రా వు, సీఐలు కే పురుషోత్తంచారి, పోతారం శ్రీనివాస్, రమేశ్‌బాబు, గుమ్మడి మల్లేశ్, కే ప్రేమ్‌కుమార్, సైదారావు, ఎం నైలు, డీసీఆర్బీ సీఐ జా దవ్ గుణవంత్‌రావు, ఎస్ఐలు ఎంఏ హకీం, స య్యద్ అన్వర్ ఉల్ హక్ పాల్గొన్నారు.