గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు బోల్తా (Road Accident) పడింది. దీంతో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతి వెళ్తున్న ప్రైవేటు బస్సు గుడిహత్నూర్ సమీపంలో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న రేలింగ్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వారంతా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్సుల్లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తలరించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.