
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 24 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని కొత్తకుమ్మరివాడలోని సీఎస్ఐ చర్చి శ్మశాన వాటిక, హ్యాండిక్యాఫ్డ్ కాలనీల్లో శ్మశాన వాటికల అభివృద్ధికి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. శ్మశాన వాటికల గురించి ఏ పార్టీలు పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపెడుతున్నదన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, నాయకులు అజయ్, జాఫర్ అహ్మద్, శ్యాముల్, సత్య సుందర్ బాబు, పద్మారావ్ పాల్గొన్నారు.
రైతన్నలకు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం..
జైనథ్, డిసెంబర్ 24 : రైతులకు నాణ్యమైన కరెం ట్ అందజేసేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్‌లో 33/11 కేవీ అదనపు విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు. ఆదిలాబాద్ సీసీఐ నుంచి 19 కి.మీ అదనపు విద్యుత్‌లైన్‌ను రూ.1.20 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణం పూర్తయితే శాశ్వతంగా విద్యుత్ అంతరాయానికి తెరపడుతుందన్నారు. బేల మండలం సిర్సన్న, సైద్పూర్తో పాటు అదనంగా దహెగాంలో సైతం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను అదనంగా మంజూరు చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్‌శాఖ ఎస్ఈ ఉత్తం జాడే, డీఈ సుభాష్, ఏడీ లక్ష్మణ్, ఏఈలు మదన్, గంగాధర్, సుషాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆర్.మనోహర్, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు ఎస్.లింగారెడ్డి, జిల్లా డైరెక్టర్ తల్లెల చంద్రయ్య, నాయకులు సతీశ్ పవార్, గంభీర్‌ఠాక్రే, దేవన్న, వెంకట్‌రెడ్డి, గణేశ్ యాదవ్, సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీలు పాల్గొన్నారు.