
మంచిర్యాల జిల్లాలో 84.6 శాతం వ్యాక్సినేషన్
163 ప్రత్యేక శిబిరాలు
12 గ్రామాల్లో వందశాతం
కరోనా నియంత్రణపై అధికారయంత్రాంగం విస్తృత ప్రచారం
పీహెచ్‌సీలను తనిఖీ చేస్తున్న కలెక్టర్, డీఎంహెచ్‌వో
మంచిర్యాల, అక్టోబర్ 24, నమస్తే తెలంగాణ : జిల్లాలో కరో నా కట్టడికి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. 311 పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీ వార్డుల్లో టీకా ప్రక్రి య జోరుగా సాగుతున్నది. ఇప్పటికే 60 ఏడ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ చేయగా, ప్రస్తుతం 18 ఏండ్లు పైబడిన వారందరికీ వేసేలా వైద్యశాఖ నిరంతరం కృషిచేస్తున్నది. 5,36, 000 లక్ష్యానికి గాను 84.6 శాతం పూర్తి చేశారు. ప్రతి రోజూ 10 నుంచి 15 వేల మందికి టీకాలు వేస్తున్నారు. కలెక్టర్ భారతీ హోళికేరి జిల్లాలోని పీహెచ్‌సీలను తనిఖీ చేస్తూ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించేలా అధికారులకు ఆదేశాలిస్తున్నారు. ఇప్పటి వరకు 4,53,456 మందికి మొదటి డోసు ఇచ్చారు.
వందశాతం లక్ష్యంగా ముందుకు..
నూరు శాతం మందికి టీకాలు ఇవ్వడమే లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ అడుగులు వేస్తున్నది. గ్రామాలు, వార్డుల్లో వందశాతం వ్యాక్సినేషన్‌పై కలెక్టర్ భారతీ హోళీకేరి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాథమిక, ఉప ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, వ్యాక్సినే షన్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు పర్యవేక్షణలో మున్సిపల్ పరిధిలోని 70 వా ర్డులు, రూరల్ సబ్ సెంటర్లు 93 కలిపి 163 ప్రత్యేక శిబిరాల ద్వారా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతున్నది. రోజుకు 15, 700 మంది టార్గెట్ కాగా, త్వరలోనే వందశాతం పూర్తిచేయాలనే లక్ష్యంతో వైద్యశాఖ ముందుకెళ్తున్నది. ఇప్పటి వరకు 2, 446 ఆవాసాలను, 2275 మురికివాడలు, కాలనీలను వ్యాక్సినేషన్ కోసం తీసుకున్నారు. 12 ఆవాసాల్లో, ఒక మురికి కాలనీలో వంద శాతం టీకాలు వేసినట్లు అధికారులు ప్రకటించారు. రోజు దాదాపు 485 మంది పట్టణ, స్థానిక సంస్థలు, పంచాయతీల నుంచి సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 19,465 మంది ఆరోగ్య శాఖ సిబ్బందిని, 12,192 మంది మున్సిపల్, జీపీ సిబ్బంది సేవలందిస్తున్నారు. 2,459 వాహనాలను ఉపయోగించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఓ వైపు వైద్యారోగ్య శాఖ ముమ్మరంగా టీకా కార్యక్రమం కొనసాగిస్తున్నా .. పండుగల నేపథ్యంలో ప్రజలు కొవిడ్ నిబంధనలు సరిగా పాటించలేదనే విమర్శలున్నాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. మాస్కు ధరించడంలేదని, చేతు లు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
అపోహలు తొలగిస్తూ.. అవగాహన కల్పిస్తూ..
టీకాపై ప్రజల్లో అపోహలను తొలగించి వ్యాక్సినేషన్‌తో కలిగే ప్రయోజనాలపై అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్‌తో పాటు జిల్లాలోని 311 పంచాయతీల్లో కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రతి రోజూ 15,700 మందికి టీకా వేయడమే లక్ష్యంగా ఆరోగ్యశాఖ ముం దుకెళ్తున్నది. మంచిర్యాల జిల్లాలో 5,36,000 మందికి లక్ష్యం కాగా, 84.6 శాతం పూర్తి చేసినట్లు, త్వరలోనే వందశాతం పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతుండడంతోనే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.