
హాజీపూర్, అక్టోబర్ 24 : తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. ఈ నెల 25న వరంగల్లో నిర్వహించే సభకు సన్నాహక సమావేశాన్ని వేంపల్లి గ్రామ శివారులో ఉన్న మంచిర్యాల గార్డెన్లో మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల, గ్రామ కమిటీలు, మండల ముఖ్య నాయకులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు అయిన సందర్భంగా విజయగర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని గ్రామాల వివిధ కమిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు తెలంగాణ ప్రభుత్వం చేపట్టి, అమలు చేస్తున్న పనులను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏ గ్రామంలో నైనా టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే అక్కడే వారిని నిలదీయాలన్నారు. సభకు ప్రతి గ్రామం నుంచి బారీ ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చే విధంగా గ్రామ కమిటీల అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలన్నారు. మండల అధ్యక్షులు మొగిళి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వేంపల్లి గ్రామ సర్పంచ్ ఓలపు శారద – రమేశ్, హాజీపూర్ ఎంపీపీ మందపల్లి స్వర్ణలత – శ్రీనివాస్, మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, మండల రైతు సమన్వయ కమిటీ కో – ఆర్టినేటర్ పూస్కూరి శ్రీనివాస్ రావు, ఏఎంసీ చైర్మన్లో మల్రాజు రామారావు, సందెల వెంకటేశ్, జడ్పీ కో-ఆప్షన్ నయిం పాషా, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గోళ్ళ శ్రీనివాస్, ఉప సర్పంచ్లు సంఘం అధ్యక్షులు జితేందర్ రావు, మాజీ మర్కెట్ కమిటీ చైర్మన్ సాగి వెంకటేశ్వర్ రావు, మండలంలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామంలోని వివిధ కమిటీల అధ్యక్ష, కార్యదర్శి, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
విజయ గర్జనను విజయవంతం చేయాలి
శ్రీరాంపూర్, అక్టోబర్ 24: నవంబర్ 15న వరంగల్లో టీఆర్ఎస్ 20 వసంతాల సందర్భంగా విజయ గర్జన మహా సభకు నస్పూర్ 1, 9వ వార్డును అధిక సంఖ్యలో మహిళలు తరలిరావాలని నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 9వ వార్డు పార్టీ కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ బండి పద్మ, పట్టణ మహిళా అధ్యక్షురాలు రౌతు రజిత, 9వ వార్డు అధ్యక్షుడు మహేందర్, యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, మహిళా అధ్యక్షురాలు తాళ్ల అమృత, ఉపాధ్యక్షురాలు బండి పద్మ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ల విజయ, నాయకులు అర్కాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.