
ఖానాపూర్ టౌన్, అక్టోబర్ 24: వచ్చే నెల 15న వరంగల్లో నిర్వహించే విజయగర్జన సభకు నియోజకవర్గం నుంచి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల స్థాయి కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మరో 20 యేండ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక నుంచి సీఎం కేసీఆర్ అందించే సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందిస్తామని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, ఎంపీపీ అబ్దుల్ మొయిద్, వైస్ ఎంపీపీ వాల్సింగ్, పార్టీ మండలాధ్యక్షుడు రాజగంగన్న, మాజీ జడ్పీటీసీ రాము నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ దేశానికే దిక్సూచి
పెంబి, అక్టోబర్ 24: రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ దేశానికే దిక్చూచిగా నిలిచిందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. పార్టీ ఆవిర్భవించి 20 యేండ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న ద్విదశాబ్ది ఉత్సవాలకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, ఎంపీపీ భూక్యా కవిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సల్లా నరేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ భూక్యా గోవింద్, ఎంపీటీసీ రామారావు, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ సుదర్శన్, సర్పంచ్లు సుధాకర్, తానాజీ, వసంత్, మహేందర్, టీఆర్ఎస్ నాయకులు గాండ్ల శంకర్, సుతారి మహేందర్, సురేశ్, శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆశయాలను నెరవేర్చాలి
పెంబి, అక్టోబర్ 24: కుమ్రం భీం ఆశయాలను నెరవేర్చాలని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదివారం శెట్పల్లి గ్రామంలో కుమ్రంభీం జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు ఆత్రం శ్రీనివాస్, పేంద్రం దేవ్రావు, వైడ్మ శేఖర్ ఉన్నారు
ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ప్రమాదం
శెట్పల్లిలో ఎమ్మెల్యే రేఖానాయక్ కుమ్రం భీం విగ్రహానికి నివాళులర్పించి తిరుగు ప్రమాణమవుతుండగా విగ్రహం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఎమ్మెల్యే నివాళి అర్పించేటప్పుడు విగ్రహం కూలిపోతే పెను ప్రమాదం సంభవించేదని ప్రజలు భావిస్తున్నారు.