
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
అభివృద్ధి పనులపై కోటపల్లి మండల నాయకులతో చర్చలు
కోటపల్లి, జనవరి 23 : కోటపల్లి మండలంలోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కోటపల్లి వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్‌రావు నేతృత్వంలో విప్ సుమన్‌ను పలు గ్రామాల నాయకులు ఆదివారం కలిశారు. ఈ సం దర్భంగా మండలంలోని రాంపూర్, దేవులవాడ, వెలమపల్లి, అన్నారం, బబ్బెరచెలుక, దేవులవాడ, లక్ష్మీపూర్, అన్నారం గ్రామాల అభివృద్ధిపై చర్చించారు. కొన్ని రోజుల్లో జరిగే ప్రాణహిత పుష్కరాలకు ఎలాంటి రాజీ లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు విప్ వివరించారు. గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, గ్రామాలకు మధ్య రోడ్డు సౌకర్యం పై చర్చించారు. మండలంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు విప్ హామీ ఇచ్చారని వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలమపల్లి సర్పంచ్ గోనె సత్యనారాయణ, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్, నాయకులు వాల వెం కటేశ్వర్ రావు, పిల్లి సమ్మయ్య, భాస్కర్ రెడ్డి, గాదె శ్రీనివాస్, ఆసంపల్లి సంపత్, అస్త బాపు తదితరులు పాల్గొన్నారు.