
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
ఇచ్చోడ, జనవరి 23 : భారత దేశమే ఒక దేవాలయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. నవదుర్గ ఆశ్రమ కమిటీ ఆదిలాబాద్ శ్రీశ్రీ కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో ఇచ్చోడలోని విఠల్ రెడ్డి గార్డెన్ సమీపంలో ఆదివారం నిర్వహించిన శతచండీ యాగానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ యజ్ఞ ఫలాన్ని మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, జనాయుర్వుద్ధి, ఐశ్వర్యవృద్ధి, విద్యావినయ సంపన్నత, శీల సంపన్నత వర్ధిల్లాలని కోరుతూ నవదుర్గ కమిటీ శ్రీశ్రీ కిషన్ మహారాజ్ 108 హోమ కుండాలతో శాస్ర్తోక్తంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కాగా.. యాగంలో ఎమ్మెల్యే సతీసమేతంగా సంప్రదాయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యాగం మూడు రోజుల పాటు కొనసాగుతుందని శ్రీశ్రీ కిషన్ మహారాజ్ తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆకట్టుకున్నాయి. మహా కత్రువులో భాగంగా హోమాలతో పాటు లక్ష దీపార్చన, కుంకుమార్చన, మహా పూర్ణాహుతి, అభిషేకాలు కన్నుల పండువగా, వైభవంగా, శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆదిలాబాద్ గోపాల కృష్ణ మందిరం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ యోగానంద సరస్వతీ స్వామి, రాంచంద్ర స్వామి, సతీశ్ భవాని, తిరుపతి స్వామి, సీఐ రమేశ్ బాబు, ఎస్ఐ ఉదయ్ కుమార్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, దాసరి భాస్కర్, వెంకటేశ్, ముస్కు గంగారెడ్డి, నిర్వాహకులు వీరనందయ్య, ఎస్ బ్రహ్మానంద్రెడ్డి, నాగార్జున రెడ్డి, కేశవ్, నాందేవ్, రవి, ముత్తన్న, పాండు పాల్గొన్నారు.