
ఎదులాపురం, జనవరి 23 :నేతాజీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సనాతన హిందూ ఉత్సవ సమితి గౌరవ సలహాదారుడు డాక్టర్ ప్రపుల్వాఝే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి గౌరవ సలహాదారుడు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు. ఆజాద్ హింద్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆంగ్లేయులను తరిమికొట్టారని కొనియాడారు. కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ, అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు రేణికుంట రవీందర్ ,పోట్టిపెల్లి విజయ్ కుమార్, సాయికృష్ణ, వామన్ రెడ్డి, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో 2కే రన్
ఇచ్చోడ, జనవరి 23: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి దేశభక్తిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఎస్ఐ ఉదయ్‌కుమార్ సూచించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో 2 కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నిమ్మల శివ కుమార్ రెడ్డి, ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి సింగారపు అరుణ్ కుమార్, నాయకులు మిట్టపల్లి దత్తాత్రేయ, సాయి, రమేశ్, అజయ్, శివ, పవన్‌సాయి, నిఖిల్ రెడ్డి, యువకులు పాల్గొన్నారు.
సొనాలలో ..
బోథ్, జనవరి 23: మండలంలోని సొనాలలో నవ నిర్మాణ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కే శుద్ధోధన్, శ్రీరాం విజయ్, శ్రీధర్, రమణ, నాగరాజ్, వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు.