
నిమ్న జాతుల ఎదుగుదలకు పోరాడిన త్యాగశీలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఘనంగా సాటే 101వ జయంతి వేడుకలు
వడోనిలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
ఎదులాపురం, ఆగస్టు 22 : భారతీయ సాహిత్య సామ్రాట్ అన్నాబావుసాటే గొప్ప దార్శనికుడని, నిమ్న జాతుల ఎదుగుదల కోసం జీవితాంతం పోరాడిన త్యాగశీలి అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ నగర్లో ఆదివారం అన్నాబావుసాటే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాటే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి కృషిచేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి ఊశన్న, అన్నాబావుసాటే సంఘం నాయకులు అంబాదాస్, దత్తరాజ్ గైక్వాడ్, దయానంద్, వెంకటి వాసుదేవ్, సూర్యకాంత్, మధూకర్, అర్జున్, రమాకాంత్, సూర్యకాంత్ గైక్వాడ్, దేవ్‌రాజ్ సూర్యవంశీ హవ్సజీ, సురేశ్ జల్బా తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 22 : మండలంలోని వడోని గ్రామంలో అన్నాబావుసాటే 101 జయంతిని నిర్వహించారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొని, అన్నాబావు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషిచేశారన్నారు. ఆయన రచించిన పుస్తకాలు సమాజాన్ని ప్రభావితం చేశాయని తెలిపారు. అనంతరం ఏజెన్సీ దళిత రైతులకు పంట రుణాలు, రైతు బంధు, రైతు బీమాతో పాటు దళిత బంధు అమలు చేయాలని చైర్మన్‌ను గ్రామస్తులు కోరారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ఎమ్మెల్యే సాయంతో సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ జాదవ్ మనోజ్, ఉప సర్పంచ్ సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత్ చౌహాన్, సూర్యవంశీ పండిత్, రాము, ఉద్దవ్, సచిన్, జగన్, అనిల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.