
ఉట్నూర్, జనవరి 22: మండల కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన వెల్డింగ్ యూనియన్ అధ్యక్షుడు ఖదీర్ తల్లి ఇటీవల మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులను శనివారం జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పరామర్శించారు. ఆయన వెంట నాయకులు మహేందర్ దుర్గే, కాంతారావు, దావుల రమేశ్, రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ జాదవ్ రమేశ్, అమ్జద్‌ఖాన్, మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి, ఆత్రం లక్ష్మణ్, జాదవ్ శ్రీకాంత్ ఉన్నారు.
పిప్పల్‌కోటి గ్రామంలో..
భీంపూర్, జనవరి 22 : మండలంలోని పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన సాత్గరి గంగారం భార్య, గణేశ్‌రెడ్డి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులను శనివారం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పరామర్శించారు. ఆయన వెంట వైస్‌ఎంపీపీ గడ్డం లస్మన్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య , నాయకులు శ్రీధర్‌రెడ్డి, గంగయ్య ఉన్నారు.