
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వినతి
భైంసా, జనవరి 22 : నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రగతి భవన్లో వినతి పత్రం అందించారు. పలు అభివృద్ధి పనుల వివరాలను సీఎంకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అదనపు నిధులు కేటాయించాలని, రోడ్ల అభివృద్దికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముథోల్ దవాఖాన అప్‌గ్రేడ్‌తో పాటు సకల సౌకర్యాలతో నూతన భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.