e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home ఆదిలాబాద్ పోడు భూముల సమస్యలపై దృష్టి

పోడు భూముల సమస్యలపై దృష్టి

ఉట్నూర్‌లో ఉన్నతాధికారుల బృందం పర్యటన
ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖల అధికారులతో సమీక్ష

ఉట్నూర్‌, అక్టోబర్‌21: పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన బృందం గురువారం ఉట్నూర్‌లో పర్యటించింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి, సీసీసీఎఫ్‌ శోభ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ క్రిస్టినా జడ్‌ చోం గ్తూ, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, అ దనపు సీసీసీఎఫ్‌ మోహన్‌ చంద్ర పర్గెన్‌తో కూ డిన బృందం నాలుగు జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులతో సమావే శం నిర్వహించా రు. పోడు భూములు, అ టవీ సంరక్షణ, హరితహారంపై జిల్లాల వా రీగా సమీక్షించారు. అటవీ భూములను రక్షణకు తీసుకుంటున్న చర్యలు, స్వాధీనం చేసుకున్న భూముల బాధితులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి పూ ర్ణిమా మాట్లాడుతూ అడ్డఘాట్‌ గ్రామంలో సుమారు 200 ఎకరాలు పోడు భూములను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి వెదురు బుట్టల తయారీతో ఉపా ధి కల్పించినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్‌, భారతి హోళికేరి, ముషారఫ్‌ అలీ ఫారూఖీ, రా హుల్‌రా జ్‌, సం గీతా సత్యనారాయణ, జితేష్‌ పాటి ల్‌, అదనపు కలెక్టర్లు, డీఎఫ్‌వోలు, ఆర్డీవో లు, డీడీవోలు, తహసీల్దార్లు, ఎఫ్‌ఆర్‌వోలు ఉన్నారు.

వినతుల వెల్లువ..
పోడు భూములపై చర్చించేందుకు ఉట్నూర్‌కు వచ్చిన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి, కమిషనర్లకు ప్రజల నుం చి వినతులు వెల్లువెత్తాయి. ఏజెన్సీలో తరాలుగా జీవిస్తున్న తమకు రాజ్యాంగం ఫలాలు దక్కడం లేదని ఫలితంగా పేదరికంలో మగ్గుతున్నామని దళిత సంఘాల జేఏసీ సంఘం కన్వీనర్‌ లింగంపల్లి చంద్రయ్య పేర్కొన్నారు. దళితులకు పరంపోగు, అసైన్డ్‌, ఇనాం భూములకు హక్కుపత్రాలు ఇచ్చి రైతుబంధు, రైతుబీమా అందజేయాలని కోరారు. నాయకులు లాజర్‌, రాజేశ్వర్‌, దేవానందం ఉన్నారు.

- Advertisement -

జీతాలు పెంచాలని వినతి
ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ, హాస్టళ్లలో పనిచేస్తున్న పార్ట్‌టైం ఉద్యోగుల వేతనాలను రూ. 6 వేల నుంచి రూ 20 వేలకు పెంచాలని, దినసరి ఉద్యోగులకు రూ. 15 వేల నుంచి రూ 30 వేలకు, శానిటేషన్‌ వర్కర్లకు రూ. 5వేల నుంచి రూ. 20 వేలకు పెంచాలని ఆ సంఘం ఉమ్మ డి జిల్లా అధ్యక్షుడు కేబీసీ నారాయణ కో రా రు. అలాగే శాశ్వత ఉద్యోగాలు చేపట్టాలని ఆర్‌ఎస్‌ శంకర్‌, రాజన్న వినతిపత్రం ఇచ్చారు.

అటవీ భూములకు హక్కు పత్రాలివ్వాలి
గిరిజనులు సాగుచేసుకుంటున్న అటవీ భూ ములకు 2006 అటవీ హక్కు చట్టం 2006 ప్రకారం హక్కు పత్రాలివ్వాలని ఆదివాసీ సే నా జిల్లా ప్రధాన కార్యదర్శి రాయిసిడాం జం గుపటేల్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఐదో షెడ్యూల్డ్‌ ప్రాంతం అట వీ హక్కుల చట్టం అమల్లో ఉన్నందున గిరిజనులకు న్యాయం చేయాలని వారు కోరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement