
కోలిండియాలో లేని హక్కులు సాధించాం
కోలిండియాలో కారుణ్యం, 61 ఎండ్లకు సర్వీస్ పెంచాలి
సింగరేణిలో మరో సంఘానికి స్థానం లేదు
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
శ్రీరాంపూర్, ఆగస్టు 21: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీబీజీకేఎస్ సిద్ధంగా ఉందని, కార్మికులను ఓటు అడిగే హక్కు తమకే ఉందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ ప్రెస్స్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్మికులకు గుర్తింపు సంఘంగా సాధించి పెట్టిన హక్కులు, జాతీయ కార్మిక సంఘాలు కార్మికులకు చేసిన అన్యాయాలను వివరించారు. గుర్తింపు కార్మిక సంఘంగా టీబీజీకేఎస్ గెలిచిన తర్వాత బీజేపీ కావాలనే పదవీ కాలం రెండేండ్లేనని చెప్పారన్నారు. ముందు ఎలాంటి ఒప్పందం లేదు కాబట్టే గతంలో అమలు చేసిన నాలుగేండ్ల పరిమితి ఉండాలని కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. తాము ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సిద్ధంగా ఉన్నామన్నారు. తమ అధ్యక్షురాలు కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్, విప్ సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా తాను, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య సీఎం కేసీఆర్‌ను కలిసి కోరిన మేరకు కార్మికులకు 61 ఏండ్లకు విరమణ వయసు పెంచుతూ సింగరేణికి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. గత మార్చి నుంచి జూలై వరకు విరమణ పొందిన వారంతా విధుల్లో చేరుతున్నారని చెప్పారు. జాతీయ సంఘాలకు దమ్మూ ధైర్యం ఉంటే కారుణ్య ఉద్యోగాలు, 61 ఏండ్లకు సర్వీస్ పెంపు కోలిండియా పరిశ్రమల్లో అమలు చేయించాలని సవాల్ విసిరారు. ఇటీవలే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు.
మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం కల్పించడానికి 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచాలని, గని ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఇస్తున్న మ్యాచింగ్ గ్రాంట్ రూ.20 నుంచి రూ.40 లక్షలకు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.15 లక్షలు చెల్లించాలని కోరినట్లు తెలిపారు. బెల్లంపల్లి రీజియన్‌లోని బెల్లంపల్లి, రామకృష్ణాపూర్ ఏరియా దవాఖానల్లో సీటీస్కాన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. సెప్టెంబర్‌లో యాక్టింగ్ చేస్తున్న కార్మికులకు క్యాటగిరీ పదోన్నతులు కల్పించినట్లు పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్‌కు అపూర్వ ఆదరణ ఉందన్నారు. సింగరేణిలో మరో కార్మిక సంఘానికి గెలిచే సత్తా లేదన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, డిపార్ట్మెంట్లలోని పర్సనల్ అధికారులు (వెల్ఫేర్) అవినీతికి పాల్పడుతూ, కార్మికులను, కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిపై డైరెక్టర్స్, జీఎంలకు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో నస్పూర్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధులు కే వీరభద్రయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, అశోక్, ఏరియా ఆర్గనైజింగ్ కార్యదర్శి తొంగల రమేశ్, మల్లేశం, కానగంటి చంద్రయ్య, పిట్ కార్యదర్శులు ఎంబడి తిరుపతి, పెంట శ్రీనివాస్, మెండ వెంకటి, నాయకులు వెంకట్‌రెడ్డి, కిషన్, సోమయ్య, సామ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇందారంఖని 1ఏ గనిపై గేట్ మీటింగ్
జైపూర్, ఆగస్టు 21: శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారం ఖని 1ఏగనిపై టీబీజీకేఎస్ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షులు, చర్చల ప్రతినిధులు కే సురేందర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, మంద మల్లారెడ్డి, వీరభద్రయ్య, కుమారస్వామి, నాయకులు మల్లేశ్, లెక్కల విజయ్, జగదీశ్వర్‌రెడ్డి, గడ్డం మల్లయ్య, రాంచందర్‌గౌడ్, సిరిపురం రామస్వామి, నర్సింహులు, అగ్గు తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.