
ఎదులాపురం, జనవరి 21 : జిల్లాలో మట్కా నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నమోదైన మట్కా కేసుల వివరాలను వెల్లడించారు. జిల్లాలోని వివిధ స్టేషన్లలో 21 కేసులు నమోదు కాగా, 50 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.3,16,500 స్వాధీనం చేసుకున్నామన్నారు. గురువారం రాత్రి జైనథ్ మండలం పిప్పవాడ చెక్‌పోస్ట్ సమీపంలో మట్కా నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సీసీఎస్, ఎస్బీ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో జిల్లాలో మట్కా నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేశామని చెప్పారు. నిందితుడు ముఖ్యంగా అన్లైన్లో బోథ్ , సొనాల, భోరజ్, మహారాష్ట్ర సరిహద్దున ఉంటూ ఏజెంట్ల ద్వారా మట్కా నిర్వహిస్తున్నాడని తెలిపారు. రూ.2,04, 500 నగదు, 4 మొబైల్ ఫోన్లు, మట్కా చీటీలు, మట్కా చాట్, గుట్కాగేమ్కి సంబంధించిన ఫ్లెక్సీ లు, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన నిర్వాహకుడితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. ఇందులో పర్సో యా అశోక్ (సామ్రాట్), పండెన్వర్ విలాస్, ప్ర శాంత్, సంతోష్, రామ, ప్రకాశ్, రవి, శంకర్ ఉన్నా రు. వీరందరూ మహారాష్ర్టలోని పాండ్రకవడ, బోరికి చెందిన వారు. ప్రధానంగా జిల్లాలో శ్రీదేవి, టైం బజార్, మిలన్, కల్యాణ్ ఇలాంటి పేర్లతో మట్కాలను నిర్వహిస్తూ జిల్లాలోని ఆమాయక ప్రజలు, రోజువారీ కూలీల వద్ద మట్కా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ మట్కా నిర్వహణపై గతం లో ఆదిలాబాద్ వన్‌టౌన్, టూటౌన్లో కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఈ సంవత్సరంలో పర్సోయా అశోక్‌పై బోథ్‌లో 2, ఇచ్చోడలో 2, ఉట్నూర్‌లో 1, ఇంద్రవెల్లిలో 1, గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదు అయి ఉన్నాయని వివరించారు. జిల్లాలో ఎక్కడైనా గుట్కా , మట్కా, జూదం, గంజాయికి సంబంధించిన ఎ లాంటి సమాచారం ఉన్న ఎస్బీ సీఐ కృష్ణమూర్తి 9490619548, సీసీఎస్ సీఐ చంద్రమౌళి 9440900635 కు సమాచారం అందించాలని సూచించారు. ఆపరేషన్‌లో ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీసీఎస్ సీఐ చంద్రమౌళి, ఎస్బీ సీఐ కృష్ణమూర్తి, జైనథ్ ఎస్ఐ పెర్సిస్, ఎస్బీ ఎస్ఐ అన్వర్‌ఉల్‌హక్, సీసీఎస్ ఎస్ఐ సిబ్బంది ఉన్నారు.