సోమవారం 08 మార్చి 2021
Adilabad - Jan 22, 2021 , 00:25:19

‘కుల వృత్తిని ఇతరులు చేస్తే ఊరుకోం’

‘కుల వృత్తిని ఇతరులు చేస్తే ఊరుకోం’

ఉట్నూర్‌, జనవరి21: తమ కుల వృత్తిని ఇతరులు చేస్తే ఊరుకోబోమని నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మంగళి పుండలిక్‌ అన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము కులవృత్తినే నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నామన్నారు. ఇటీవల కొందరు నిర్మల్‌, మంచిర్యాల పట్టణాల్లో ఇతర వర్గాల వారు తమ వృత్తి షాపులను పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అధికారులు తమకు లైసెన్స్‌లు మంజూరు చేస్తే ఇతరులు రాకుండా అడ్డుకోవచ్చన్నారు. సమావేశంలో డివిజన్‌ అధ్యక్షుడు వెంకటేశ్‌, మండలాధ్యక్షుడు రాచకొండ నవీన్‌, సభ్యులు కంది వెంకటరమణ, ప్రవీణ్‌, శ్రీను, మల్లేశ్‌, కళ్యాణ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo