కోత వేతనాల చెల్లింపునకు కసరత్తు

- అక్టోబర్ నెల వేతనాలతో అందించేందుకు కసరత్తు
- ఉమ్మడి జిల్లాలో 17,080 మంది ఉద్యోగులు
- తొలి విడుతలో రూ. 32.27 కోట్లు జమ
- బిల్లులు సమర్పిస్తున్న ట్రెజరీ అధికారులు
కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా ఉద్యోగుల జీతా ల్లో కోత పెట్టిన డబ్బులను అక్టోబర్ నెల వేతనాలతో అం దించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 17, 080 మంది ఉద్యోగులు ఉండగా, తొలివిడుతలో రూ. 32.27 కోట్లు జమ చేయనుంది. ఇందుకు సంబంధించిన బిల్లులను ట్రెజరీ యంత్రాంగం సిద్ధం చేస్తున్నది.
ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. ఈ వేతనాలను అక్టోబరు నెల నుంచి ఉద్యోగులకు అందించనుంది. ఈ మేరకు సర్కారు నుంచి ఆదేశాలు రావడంతో, ట్రైజరీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు విడుతల్లో ఈ డబ్బులు ఉద్యోగులకు అందనున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,080 మంది ఉద్యోగులు ఉండగా, మొదటి విడుతలో ప్రభుత్వం రూ. 32.27 కోట్లు అందించనుంది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన డ్రాయింగ్ అధికారులు తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది నెలవారీ వేతనాలు బిల్లులతో పాటు కోత విధించిన బిల్లులను ట్రెజరీ అధికారులకు సమర్పిస్తున్నారు. అదిలాబాద్ జిల్లాలో 5427 మంది ఉద్యోగులు ఉండగా వారికి సంబంధించిన రూ.8.50 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 4516 మంది ఉద్యోగులకు రూ. 9.03 కోట్లు, నిర్మల్ జిల్లాలో 3639 మంది ఉద్యోగులకు రూ.7.91 కోట్లు, కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాలో 3,498 మంది ఉద్యోగులకు రూ. 6.83 కోట్లను ప్రభుత్వం మొదటి విడుతలో అందించనుంది. ప్రభుత్వ శాఖల డ్రాయింగ్ అధికారులు బిల్లులు అందజేస్తే వాటికి ఆమోదం తీసుకుని ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- ‘ప్రాపర్టీ ట్యాక్స్'తో పరిష్కారం
- పట్టభద్ర ఓటర్లు 181 %పెరుగుదల
- రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం
- ఉచితంగానే వ్యాధి నిర్ధారణ పరీక్షలు
- పాదచారులకు పై వంతెనలు
- అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగాలి
- ట్రేడ్ లైసెన్స్ ఇక తప్పనిసరి
- వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం
- ‘వయోధికుల సమస్యలు పరిష్కరిస్తా’
- కార్పొరేట్‌ను మించి సేవలు