సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Feb 05, 2020 , 01:17:35

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

ఆదిలాబాద్‌ రూరల్‌: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారి దస్రూనాయక్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో స్పోర్ట్స్‌, కల్చరల్‌ డే ఘనంగా నిర్వహించారు. డీఐఈవో ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కళాశాల స్థాయి వచ్చేవరకు ఆటలను పక్కనబెట్టి కేవలం చదువుకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. దీంతో పిల్లలు శారీరకంగా బలహీనంగా మారి మానసిక ఆందోళనకు గురువుతున్నట్లు తెలిపారు. దీనిని నివారించడానికి ప్రభుత్వం గత ఏడాది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు భారీగా క్రీడా పరికరాలను అందించిందని తెలిపారు. వాటిని ఉపయోగించుకొని విద్యార్థులు శారీరక దృఢత్వం పెంచుకోవాలన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. అనంతరం పలు క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ విఠల్‌, శ్రీనివాస్‌, బాలాజీ, గౌతమ్‌, శివరాజ్‌ నాగోరావ్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo