e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home ఆదిలాబాద్ లడ్డూ వేలం@ రూ.88,888

లడ్డూ వేలం@ రూ.88,888

జైనూర్‌లో రూ.61 వేలకు..
పోటాపోటీగా వేలం పాట

తాండూర్‌, సెప్టెంబర్‌ 19 : తాండూర్‌ మండల కేంద్రంలోని శ్రీ గణేశ్‌ మండలి నిర్వాహకులు నవరాత్రుల్లో పూజించిన లడ్డూను రూ. 88,888లకు తాండూరు ఐబీకి చెందిన దుగ్యాల హన్మంతరావు రేఖారాణి దంపతులు, 2 గ్రాముల బంగారు లక్ష్మి, గణపతి ప్రతిమలను రూ. 1,11,111లకు మండల కేంద్రానికి చెందిన బోయినపల్లి సత్యనారాయణరావు జ్యోతి దంపతులు వేలంలోదక్కించుకున్నారు. మండలంలోని పలు ఆలయాలలో లడ్డూ, కలశాలకు వేలం పాటలు నిర్వహించారు.
జైనూర్‌లో రూ.61 వేలకు..
జైనూర్‌, సెప్టెంబర్‌ 19: జైనూర్‌ మండల కేంద్రంలో ఉన్న సార్వజనిక్‌ గణేశ్‌ మండపంలో లడ్డూకోసం వేలంపాట నిర్వహించగా ఆర్య యువజన సంఘం సభ్యులు రూ.61 వేలకు వేలం పాడి లడ్డూ దక్కించుకున్నారు.

నస్పూర్‌లో రూ.26,116కి వేలం..
సీసీసీ నస్పూర్‌, సెప్టెంబర్‌ 19: సీసీసీ నస్పూర్‌లోని ఆర్‌కే-5కాలనీ శివ గణేశ్‌ మండలి వద్ద నిర్వహించిన లడ్డూ, కలశం కోసం వేలం పాట పోటాపోటీగా జరిగింది. లడ్డూను రూ.26,116లకు మల్లయ్య దక్కించుకోగా, కలశాన్ని కెంగర్ల శంకర్‌ రూ.11,116కు దక్కించుకున్నాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement