
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు19 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చేసుకొనే పండుగలకు ప్రత్యేక స్థానం ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని దిమ్మ గ్రామం లో సవారీ బంగ్లాను గురువారం ప్రారంభించారు. పీరీలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా పీరీల పండుగను నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, వైస్ ఎంపీపీ రమేశ్, నాయకులు జగదీశ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రుయ్యాడి పీరీలను దర్శించుకున్న ప్రముఖులు
తలమడుగు, ఆగస్టు 19 : మండలంలోని రుయ్యాడి గ్రామంలో పీరీలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్, మాజీ ఎంపీ నగేశ్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ కమి టీ అధ్యక్షుడు, డెయిరీ చైర్మ న్ లోక భూమారెడ్డి స్వాగ తం పలికారు. మలీదల సం దర్భంగా ఆలయంలో భక్తు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయం కిటకిటలాడింది.