
ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
బోథ్, ఆగస్టు 19: పాత జ్ఞాపకాలను భద్రంగా ఉంచేది ఫొటో అని ఫొటోగ్రాఫర్ల సంఘం మండలాధ్యక్షుడు బూస లక్ష్మణ్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ సురేందర్యాదవ్తో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు సదాశివ్, రోహిత్, దేవేందర్, సతీశ్, రవీందర్, నరేశ్, అనిల్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, ఆగస్టు 19: మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఫొటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ ప్రవీణ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్లబ్ గౌరవాధ్యక్షుడు, అధ్యక్షుడు బండారి రవీందర్, సీనియర్ ఫొటోగ్రాఫర్లను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ప్రశాంత్, కార్యదర్శి ముసాబేగ్, ఉపాధ్యక్షుడు ఆనంద్‌నాయక్, రంజాన్, ప్రకాశ్, గంగాధర్, మండల ఫొటోగ్రాఫర్లు, తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ ఫొటోగ్రాఫర్లకు సన్మానం
ఉట్నూర్, ఆగస్టు 19: మండల కేంద్రంలోని హెచ్కేజీఎస్ ఫంక్షన్ హాల్లో ఉట్నూర్ ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎఫ్‌డీవో రాహుల్ సీనియర్ ఫొటోగ్రాఫర్లను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన శంకర్‌సింగ్ కుంటుంబానికి రూ.50వేల ఆర్థిక సాయం సంఘం నుంచి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఫొటోగ్రాఫర్ మురళీధర్ అహుజా, ఉట్నూర్ ఫొటో, వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మరికంటి మహేశ్, ప్రధాన కార్యదర్శి అశోక్, గౌరవాధ్యక్షుడు భరత్‌సింగ్, సభ్యులు కిశోర్, విజయ్‌సింగ్, ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
నేరడిగొండ, ఆగస్టు 19 : మండల కేంద్రంలో ఫొటోగ్రాఫర్లు లూయిస్ డాగుర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల ఫొటోగ్రఫీ యూనియన్ను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాపాక విజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా జాదవ్ సంతోష్, కార్యదర్శిగా సంతోష్, సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాకేశ్, భోజారెడ్డి, సురేశ్, రాము, శేఖర్, వినోద్ పాల్గొన్నారు.