
ఎదులాపురం, జనవరి 19 : జిల్లాలో అసాంఘిక కా ర్యకలాపాలను పూర్తిగా నిర్మూలించే దిశగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నదని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మట్కా, గుట్కా, గ్యాంబ్లింగ్, గేమింగ్ మొదలగు అసాంఘిక కార్యకలాపాలపై పక్కా ప్రణాళికతో స్పెషల్‌డ్రైవ్ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ముఖ్యంగా మట్కాకు బానిసై అమాయక ప్రజలు అప్పులపాలవుతున్నారని సూచించారు. ఇటీవలే ఒక కేసు విచారణలో ఉత్తమ ప్రదర్శన అందించిన ముగ్గురు కానిస్టేబుళ్లకు నగదు రివార్డు అందించి వారిని అభినందించారు. పరిపాలన అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ ఎం విజయ్ కుమార్, సీఐలు ఎస్ శ్రీనివాస్, పీ పురుషోత్తంచారి, ఎస్ రామకృష్ణ, సైదారావ్, జీ మల్లేశ్, ఆర్ఐలు డీ వెంకటి, జీ వేణు, వంశీకృష్ణ, శ్రీపాల్, ఎస్పీ సీసీ దుర్గం శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ అన్వర్ ఉల్ హక్, ఎస్ఐలు పాల్గొన్నారు.
నిందితులను అరెస్టు చేయాలి
వివిధ కేసులుల్లో తప్పించుకొని తిరుగుతున్న నిందితులను వెంటనే అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టలని ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి సూచించారు. బుధవారం సాయంత్రం వన్‌టౌన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారక్ పరిసరాలను సందర్శించి పలు సూచనలుచేశారు. పోలీస్ స్టేషన్లో రోజువారీగా నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల రికార్డులను పరిశీలించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జీ మల్లేశ్, ఎస్ఐ అప్పారావు, నూతన ఎస్ఐలు ఉన్నారు.