గోదావరిఖని,జనవరి 3: బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు 19శాతం పెరుగుదలతో ఖరారైంది. మంగళవారం కొల్ కతాలో జరిగిన సమావేశంలో రోజంతా జరిగిన చర్చల్లో 4 కార్మిక సంఘాలు 28 శాతం నుంచి దిగివచ్చి 19శాతం వేతనాల పెరుగుదలకు అంగీకరించాయి. ఇందులో పాల్గొన్న హెచ్ఎంఎస్ మాత్రం 20 శాతం వేతనాల పె రుగుదల ఉండాలని పట్టుబట్టింది. చివరకు ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్ యూ నియన్లు సంతకాలు చేయడంతో ఒప్పందం కుదిరింది. మొదటి కేటగిరి కార్మికుడికి రూ.6973.73 పైసలుగా పెరుగుదల ఉం టుందని నాయకులు చెబుతున్నారు.
పదో వే తన ఒప్పందంలో మొదటి కేటగిరి కార్మికుడి కి కేవలం రూ.4800 లబ్ధ్ది కలిగితే ఈసారి రూ.7వేల వరకు ఉంటుందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, వేజ్‌బోర్డు సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. 11వ వేత న ఒప్పందానికి సంబంధించి 8వ సారి జరిగిన చర్చల్లో మొదట 4 కార్మిక సంఘాలు 28 శాతం ఎంజీబీ చెల్లించాలని డిమాండ్ చేయ గా కోలిండియా యాజమాన్యం 12శాతం నుంచి ఒక్కొ శాతం పెంచుతూ వచ్చింది. చి వరకు 20శాతం వేతనాల పెరుగుదల ఉంటే నే అగ్రిమెంట్ చేస్తామని కార్మిక సంఘాలు తే ల్చి చెప్పాయి. దీంతో యాజమాన్యం చివర కు 19శాతం పెంపునకు అంగీకరించింది. దీ నికి ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్ యూనియన్లు ఒప్పుకున్నాయి.
ఇదిలా ఉంటే రెండో కేటగిరి కార్మికుడికి రూ.7130, 3వ కేటగిరి కార్మికుడికి రూ.7,348, 4వ కేటగిరి కి రూ.7,497, 5వ కేటగిరికి రూ.7,808, 6వ కేటగిరికి రూ.8,149 పెరుగుదల ఉం టుందని నాయకులు తెలిపారు. ఒకటో కేటగి రి కార్మికుడి కనీస బేసిక్ రోజుకు రూ.1,502. 67పైసలు గా ఉంటుందని, 2వ కేటగిరిలో రూ.1536, 3వలో రూ.1583, 4వలో రూ.1615, 5వలో రూ.1682, 6వలో రూ.1756గా ఉంటుందని తెలిపారు.
ఈ ఒప్పందం మంచి పరిణామం
బొగ్గు గని కార్మికులకు 11వ వేతన ఒప్పందంలో మంచి వేతనాల పెరుగుదల ఉంటుంది. 11వ వేజ్‌బోర్డులో 3శాతం నుంచి వేతనాల పెరుగుదలకు మొగ్గు చూపిన కోలిండియా యాజమాన్యాన్ని 19 శాతం వరకు మినిమమ్ గ్యారంటీ బెనిఫిట్ పెంచే విధంగా చేయడం మంచి పరిణామం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కార్మికులకు లబ్ధి కలి గే విధంగా కృషి చేసి వేతనాల పెంపుదలకు కృషి చేశాం. 10వ వేజ్‌బోర్డులో వేతనాల కన్నా ఈ వేజ్‌బోర్డులో ఎక్కువ లబ్ధి కలిగే విధంగా చూశాం. ఇదంతా కార్మికుల విజయంగా భావిస్తున్నాం.
– వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి
కనీసం 25 శాతం ఉంటే బాగుండేది..
11వ వేతన ఒప్పందంలో 19 శాతం పెంపునకు అంగీకరించడం వల్ల కార్మికులకు అనుకున్న మేర ప్రయోజనం చేకూరలేదు. జాతీయ కార్మిక సంఘాలు కనీసంగా 25శాతం వేతనాల పెం పునకు కృషి చేస్తే బాగుండేది. దేశంలో ధరల పెరుగుదల భారీగా ఉన్న వీడీఏను 27.8గా నిర్ధారించడం వల్ల ఈ ఒప్పందంలో కార్మికులకు తీరని అన్యాయం జరిగింది. కేవలం 19 శాతం ఎం జీబీకే ఒప్పందం చేసుకోవడం వల్ల కార్మికులకు ప్రయోజనం లేకుండా ఉంటుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల వేజ్‌బోర్డులో అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. జాతీయ కార్మిక సంఘాలు మరింత బలంగా పోరాడితే బాగుండేది. గుర్తింపు కార్మిక సంఘంగా మేం మాత్రం వేతన ఒప్పందంపై అసంతృప్తితోనే ఉన్నాం.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి