
ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
మండల సమావేశంలో మిషన్‌భగీరథ అధికారులకు ఆదేశం
నార్నూర్, డిసెంబర్ 18 : గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో కార్యాల య సమావేశ మందిరంలో శనివారం ఎంపీపీ కనక మోతుబాయి అధ్యక్షతన మండల సమావే శం జరిగింది. దీనికి జడ్పీ చైర్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు పథ కాలు, ప్రగతిని వివరించారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ నార్నూర్, గాదిగూడ మండ లాల్లోని ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుం డా చూడాలన్నారు. ఉమ్మడి మండలాన్ని దత్తత తీసుకోవాలని మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు 100 రోజుల ప్రణాళికలో ప్రతి సమస్యను గుర్తించి నీటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎంపీడీవో రమేశ్, తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్, పీఏసీసీ చైర్మన్ ఆడే సురేశ్, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, ఎంఈ వో రాపెల్లి ఆశన్న, ఏవో గిత్తె రమేశ్, డీడీవో పవన్ కుమార్, ఏఈలు సునీల్, జాడి లింగన్న, ఎంపీ వో స్వప్నశీల, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ హయాంలోనే అద్భుతమైన పథకాలు
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే అద్భుత మైన పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. ఖంపూర్ పంచాయతీ పరిధిలోని పూనగూడలో విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. జడ్పీ చైర్మన్ కు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సన్మా నించారు. భీంపూర్‌లోని శనేశ్వరుని ఆలయంలో నిర్వహించిన యజ్ఞానికి జడ్పీ చైర్మన్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ కనక మోతు బాయి, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, సర్పం చ్‌లు సలాం ఆనంద్‌రావ్, సర్పంచ్ రాథోడ్ విష్ణు, ఎంపీటీసీ ఏత్మాబాయి,నాయకులు కనక ప్రభా కర్, శ్రీరామ్, మానిరావ్, నాయక్ రాథోడ్ జగ్న నాథ్, బదావత్ ఉత్తమ్, తదితరులున్నారు.