
నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి
న్యూలోలంలో ఇంటింటా తనిఖీలు
దిలావర్పూర్ అక్టోబర్ 18 : శాంతి భద్రతల కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని న్యూ లోలం గ్రామంలో ఎస్ఐ ప్రసాద్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్రువీకరణ పత్రాలు లేని 82 బైక్‌లు, 3 కార్లు, 2 ఆటోలను పట్టుకున్నామన్నారు. వాటి పై ఉన్న జరిమానాలు రూ.66,328 వసూలు చేశామన్నారు. గ్రామంలో కొంతమంది యువకులు గంజాయికి అలవాటు పడుతున్నారని, వారికి విక్రయించేవారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాల నియంత్రణ మరింత సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో నిర్మల్ గ్రామీణ సీఐ వెంకటేశ్, దిలావర్పూర్, ఎస్ఐ ప్రసాద్, నర్సాపూర్(జీ)ఎస్ఐ వెంకటరమణ, సోన్, మామడ, లక్ష్మణచాంద ఎస్ఐలు, స్థానిక నాయకులు ఒడ్నం కృష్ణ, నర్సయ్య, నరేందర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.