
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటన
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు18: అభివృద్ధే ధ్యే యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని ఆదిలాబా ద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని సంజయ్‌నగర్‌లో రూ.20లక్షలతో రోడ్డు ప నులకు, కేఆర్కే కాలనీలో మిషన్‌భగీరథ నీటి సరఫరాను బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశా రు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకునే సమ యం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా మని చెప్పారు. పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి రూ.3.5 కోట్లతో 4 ట్యాంకులు నిర్మించామన్నారు. రోడ్ల వెడల్పు, విద్యుదీకరణ పనులు త్వరలోనే పూర్తి చేసి, ప్రా రంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కమిషనర్ శైలజ, ఈఈ వెంకట శేషయ్య, ఏఈ అరుణ్, కౌన్సిలర్లు అంజుబాయ్, అజయ్, అశోక్‌స్వామి పాల్గొన్నారు.
ప్రశాంతంగా జరుపుకోవాలి..
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎ మ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. దస్నాపూర్‌లోని సవారి బంగ్లాలో బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేశారు. కౌన్సిలర్ భరత్, రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం
బేల, ఆగస్టు 18: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఆదిలాబా ద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బేల మండలంలోని ఖోగ్ధూర్ గ్రామ పంచాయతీలో రైతు వేదిక ప్రారంభోత్సవంతో పాటు రైతులకు సీపీఎఫ్ ( ఎన్జీవో) ఆధ్వర్యంలో పనిముట్లను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమల వుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమల వుతున్నాయా.. అని ప్రశ్నించారు. జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, నాయకు లు గంభీర్ ఠాక్రే, మంగేశ్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, సతీశ్ పవార్, మస్కే తేజ్‌రావు, ఇంద్రశేఖర్, జితేందర్, సంతోష్, ఏవో విశ్వామిత్ర, తదితరులు న్నారు.
పార్టీలో చేరికలు
బేల మండలంలోని వాడగూడతో పాటు బాది గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెం దిన 200 మంది నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే జోగురామన్న కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.