
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
బేల, ఆగస్టు 18: అన్ని మతాలకు రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని కరోని(కే ) గ్రామంలో సవారీ పీరీలను బుధవారం మండల నాయకులతో కలిసి దర్శించుకున్నారు. బంగ్లా వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్ పవార్, ఇంద్రశేఖర్, రాందాస్, తేజ్‌రావు ఉన్నారు.
బీజేపీ నేతలకు అభివృద్ధి పథకాలు కనబడడం లేదా…
జైనథ్, ఆగస్టు 18: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కనబడడం లేదాని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బీజేపీ నేతలను ప్రశ్నించారు. మండల కేంద్రంలో 28 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు, 171మందికి స్ప్రింకర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన నాలుగు రకాల రాయితీ పథకాలు ఎత్తివేసిందని విమర్శించారు. జన్‌ధన్ ఖాతా ఉన్న మహిళలకు రూ.15లక్షలు వేస్తామని చెప్పి పీఎం నరేంద్రమోదీ ఇప్పటి వరకు రూపాయి అందివ్వలేదని అన్నారు. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.2వేల పింఛన్ ఇస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే నెల నుంచి మంజూరు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, తహసీల్దార్ మహేంద్రనాథ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ చంద్రయ్య, మండల కన్వీనర్ ఎస్ లింగగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీ వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తమ్ యాదవ్, ఎంపీటీసీ దేవన్న పాల్గొన్నారు.
సవారీబంగ్లా షెడ్డు ప్రారంభం
జైనథ్, ఆగస్టు 18: మండలంలోని ఆకోలి గ్రామంలో రూ.5లక్షలతో నిర్మించిన సవారీబంగ్లా షెడ్డును ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, సర్పంచ్ వాణికేశవ్, సంతోష్‌రెడ్డి, ప్రభాకర్, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.