
‘నమస్తే’ కథనానికి స్పందించిన కలెక్టర్
భూమిని ఆమె పేరిట మార్చాలని అధికారులకు ఆదేశం
ముథోల్, నవంబర్ 17: ముథోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామానికి చెందిన చిన్నారి రోషిణికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ హామీనిచ్చారు. తల్లి సుంకరి భూమవ్వ మంగళవారం మృతి చెందగా, అనాథగా మిగిలిన రోషిణిపై ‘నమస్తే తె లంగాణ’ కథనం వెలువరించింది. దీంతో ఆయన బుధవారం పరామ ర్శించారు. భూమవ్వ మృతికి కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసు కున్నారు. చిన్నారిని ఆదిలాబాద్‌లోని బాలసదన్‌కు తరలించాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. పాపకు సంబంధించిన భూమి విషయంలో వెంటనే పట్టా మార్పిడి చేయాలని తహసీల్దార్‌కు సూచిం చారు. బంధువులు పాపను చూడాలనుకుంటే బాలసదన్‌కు వెళ్లాలని కోరారు. ఆర్డీవో లోకేశ్వర్ రావు, తహసీల్దార్ శివప్రసాద్, సీడీపీవో శ్రీ మతి, ఆయా శాఖల అధికారులు తదితరులున్నారు.