
పోలీస్ సిబ్బందికి నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ సూచన
నిర్మల్ అర్బన్, నవంబర్ 17: ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలతో పాటు ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టా లని నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నా రు. నిర్మల్లోని ప్రశాంత్ జీకే దవాఖానను పోలీస్ భద్రతలో చేర్చిన సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీ స్ విభాగంలో పని చేస్తున్న అన్ని స్థాయిల సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నదని తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యు లకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఆరోగ్య భద్రత ద్వారా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు. అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు ఉపేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, సీఐలు రమేశ్, వెంకటేశ్, ఆర్ఐలు వెంకటి, రమేశ్, వైద్యులు రా మకృష్ణ, ప్రశాంత్ తదితరులున్నారు.
వాహనాల నిర్వహణ సక్రమంగా ఉండాలి
ప్రజలకు వేగవంతమైన సేవలను అందించేం దు కు పోలీసులు తమ వా హనాల నిర్వహణ సక్ర మంగా ఉంచుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ వెం కటేశ్వర్లు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్ల పెట్రోలింగ్ వాహనాలను తనిఖీ చేశారు. వాటి పనితీరు ను పరిశీలించారు. ద్విచక్ర వాహనాలను నడిపే వారు హెల్మెట్ తప్ప కుండా ధరించాలని సూచించారు. కార్యక్రమంలో రమేశ్, ఎంటీవో వినోద్, మెకానిక్ కృష్ణ, సిబ్బంది రాజు, డ్రైవర్లు పాల్గొన్నారు.